/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Global-Acceptance-of-Indias-Digital-Payment-Systems-like-UPI-RuPay-Expanding.jpg)
నెలనెల కొత్తకొత్త రూల్స్ దేశంలో అమల్లోకి వస్తుంటాయి.కొన్ని మంచి చేస్తే..కొన్ని నిరాశకు గురి చేస్తాయి. ఏది ఏమైనా ఈ మార్పులు చేర్పుల ప్రభావం మాత్రం సామాన్యుల మీద ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రకటనలు ఫిబ్రవరిలో చాలానే ఉన్నాయి. ఈరోజు ఫిబ్రవరిలోకి అడుగుపెట్టిన క్రమంలో ఇప్పుడు ఈ నెలలో ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయి. వేటిల్లో కొత్త రూల్స్ ఉన్నాయి. వేటిల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి వంటి వివరాల్ని తెలుసుకుందాం.
ఇందులో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల నుంచి క్రెడిట్ కార్డుల్లో మార్పులు, యూపీఐ పేమంట్లకి సంబంధించిన కొత్త రూల్స్ బోలెడు ఉన్నాయి.
యూపీఐ ట్రాన్సాక్షన్ ..
డిజిటల్ పేమెంట్స్ చేసేవారు, యూపీఐ యాప్స్ వినియోగించేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అప్డేట్ ఇది. డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పించేలా NPCI ముందడుగు వేసింది. దీంట్లో భాగంగానే యూపీఐ పేమెంట్లకు సంబంధించి కొత్త నిబంధన తీసుకొచ్చింది. యూపీఐ లావాదేవీ చేసిన సమయంలో ఆటోమేటిక్‌గా క్రియేట్ అయ్యే ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ (#,@,$,%,^,&,*) లేకుండా చూడాలని పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌కు సూచించింది.
Also Read: మన దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీక్.. ఆర్థిక మంత్రి ఔట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?
అల్ఫాన్యూమరిక్ అంటే నంబర్లు, అక్షరాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. యూజర్లు కూడా ఇది గుర్తుంచుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్‌తో ఏదైనా ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటే.. ఆ పేమెంట్ తిరస్కరణకు గురవుతుంది.
ఆర్బీఐ :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఫిబ్రవరి 5-7 తేదీల్లో జరగనుంది. ఏడో తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఇదే తొలి పాలసీ మీటింగ్ కావడం విశేషం. గత కొన్ని సమీక్షల్లో వడ్డీ రేట్లను గరిష్టాల వద్ద యథాతథంగానే ఉంచుతూ వస్తున్న ఆర్బీఐ.. ఫెడ్ బాటలోనే ఈసారి తగ్గిస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇదే జరిగితే బ్యాంకులు కూడా లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. ఇది కూడా జనంపై నేరుగా ప్రభావం చూపించబోతుంది.
బడ్జెట్:
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీంట్లో ఎలాంటి మార్పులుంటాయోనని జనమంతా ఆసక్తిగా, ఆశతో చూస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఊరట సహా నిరుద్యోగ యువతకు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి పెంపు వంటి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. జనంపై నేరుగా ప్రభావం ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ :
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంకు కీలక ప్రకటన చేసింది. 2025, ఫిబ్రవరి 1 నుంచి జనరల్ షెడ్యూల్ ఆఫ్ ఫీచర్స్ అండ్ ఛార్జెస్‌కు (GSFC) సంబంధించి అప్డేట్స్ చేసింది. బ్రాంచులు, క్యాష్ డిపాజిట్ మెషీన్లలో క్యాష్ ట్రాన్సాక్షన్ ఛార్జీల్ని సవరించింది. డిపాజిట్లు, ఫ్రీ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక మార్పులు ఫిబ్రవరి 1 నుంచి అమలు అవుతున్నాయి. ఇక్కడ పూర్తి వివరాల కోసం బ్యాంక్ బ్రాంచును సంప్రదించండి.
ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు మార్పులు:
క్రెడిట్ కార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు వెల్లడించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ మిలీనియా, ఫస్ట్ వెల్త్, ఫస్ట్ SWYP క్రెడిట్ కార్డుల్లో ఫిబ్రవరి 20 నుంచి మార్పులు వస్తున్నాయి. ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ అయిన క్రెడ్, పేటీఎం, మొబిక్విక్ వంటి వాటి ద్వారా ఎడ్యుకేషన్ ఫీ పేమెంట్స్ చేస్తే ఒక శాతం ఛార్జీగా వసూలు చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 20 తర్వాత జారీ చేసే యాడ్ ఆన్ కార్డ్స్‌పై జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 499 ప్లస్ టాక్సుగా వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది.
మారుతీ కార్ల :
దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి సెలెరియా, వ్యాగన్ R, స్విఫ్ట్, విటారా, బాలెనో, ఎక్స్- ప్రెస్సో, డిజైర్ ఇలా అన్ని మోడల్స్‌పై ధరల పెంపు ఉంటుందని తెలిపింది. గరిష్టంగా రూ. 32,500 వరకు పెంపు ఉందని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read: America Flight Accident: బ్లాక్ బాక్స్ దొరికింది..మిస్టరీ వీడుతుందా?
Also Read: Ukrain: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్ సైనికులు!