Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

బెంగళూరు వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా షో 2025 జరుగుతుంది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో చికెన్, మటన్, చేపలు వంటి విక్రయాలు నిషేధించారు

New Update
chicken

Karnataka: కర్ణాటక రాజధాని బెంగళూరులో వచ్చే నెలలో నాలుగు రోజుల పాటు ఏరో ఇండియా షో జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బృహత్ బెంగళూరు మహానగరపాలక సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చుట్టూ మాంసం దుకాణాలలో మాంసం విక్రయాలు ఆపేయాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Manchu Manoj: నా గొడవ ఆస్తి కోసం కాదు, నేను పోరాడేది వాళ్ళ కోసమే.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు

యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ చుట్టుపక్కల 13 కిలోమీటర్ల పరిధిలోని చికెన్, మటన్ షాపులలో మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. చికెన్, మటన్ దుకాణాలతో పాటుగా నాన్ వెజ్ వంటకాలు అందించే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా బీబీఎంపీ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చుట్టూ ఈ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి.

అయితే ఎయిర్ షో‌కు, చికెన్, మటన్ షాపులకు లింకేమిటని.. చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎయి‌ర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఎయిర్ షో జరిగితే, చికెన్ షాపులు, మటన్ దుకాణాలలో మాంసం విక్రయాలు ఎందుకు బంద్ చేయాలని.. హోటళ్లలో ఎందుకు నాన్ వెజ్ ఫుడ్ అందించకూడదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అనుమానాలకు బీబీఎంపీ అధికారులు ఓ క్లారిటీ అందించారు.

Also Read: సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు

అందుకే ఆంక్షలు...

 మటన్ షాపులు వంటి మాంసాహారం విక్రయించే చోట్ల గద్దలు, డేగలు వంటివి తిరుగుతుంటాయని.. అందుకే ఆంక్షలు విధించినట్లు చెప్తున్నారు. ఈ గద్దలు, డేగలు ఎయిర్ షో జరిగే సమయంలో ఆ ప్రాంతంలోకి వస్తే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీబీఎంపీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీబీఎంపీ నిర్ణయానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అలాగే ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు 1996 నుంచి బెంగళూరులో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 14 ఎయిర్ షోలు నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ  యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా 2025 ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే. ఏరో ఇండియా షో దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన అని తెలిసిన విషయమే.

ఫిబ్రవరిలో జరిగే ఎయిర్ షోలో సుమారుగా 800 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 53 విమానాలు పాల్గొంటాయని.. 7 లక్షలమంది సందర్శకులు వస్తారని అధికారుల అంచనా. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు, అంకుర పరిశ్రమలు, విదేశీ పెట్టుబడిదారులు ఇలా చాలా మంది ఈ ఎయిర్ షోకు హాజరవుతారు. 

Also Read: Israel-Hamas: ఇజ్రాయెల్‌- హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్‌బొల్లా ఏం చెప్పిందంటే ?

Also Read: Saif Ali Khan: సైఫ్‌పై దాడి.. అర్థరాత్రి ఏం జరిగిందంటే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు