/rtv/media/media_files/2026/02/23/fotojet-42-2026-02-23-15-02-29.jpg)
thiruvananthapuram fire accident
కేరళ(kerala) రాజధాని తిరువనంతపురం సమీపంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. త్రివేండ్రంలోని పల్లిప్పురం సమీపంలో ఉన్న స్కాటిష్ స్కూల్లో ఈ రోజుల తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన స్కూల్ బస్సులు(school-bus) ఒక్కసారిగా పేలిపోయాయి. పెద్ద శబ్ధాలు రావడంతో పాటు మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళలనకు గురయ్యారు. పాఠశాల మైదానంలో పార్కింగ్‌లో ఉంచిన మూడు స్కూల్ బస్సులు మంటల్లో చిక్కుకుని దగ్ధమవడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read : కన్నకూతురిపై తల్లి ఘాతుకం: ప్రియుడితో అత్యాచారం చేయించి
Thiruvananthapuram Fire Accident
పేలుళ్ల శబ్ధానికి నిద్రలేచిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పందిచిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు(fire-engine). అయితే అప్పటికే మూడు బస్సులు పూర్తిగా దగ్దమవ్వగా, మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది. బస్సులకు నిప్పంటుకున్న విషయం తెలియగానే కజకూట్టం, చాకై ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనపై కజకూట్టం అగ్నిమాపక కేంద్ర అధికారి మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో రెండు పాఠశాల బస్సులతో పాటు ఒక ట్రావెలర్ వాహనం పూర్తిగా కాలిబూడిదయ్యిందని వివరించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని ఆయన వివరించారు.
కాగా తెల్లవారు జామున పెద్ద శబ్ధంతో బస్సులు కాలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా బస్సులకు ఎదురుగా పార్క్ చేసి ఉండాల్సిన ట్రావెలర్ వాహనం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల వైపునకు కదిలి ఉండటంతో పాఠశాల సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఎవరో కావాలనే ఆ వాహనాన్ని నెట్టి ఉండవచ్చని, మంటలు కూడా ఆ ట్రావెలర్ నుంచే ప్రారంభమై ఉంటాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకేసారి మూడు బస్సులు పూర్తిగా కాలిపోవడంతో పాఠశాల యజమానులకు భారీ నష్టం సంభవించిది. ఇంజిన్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేదా ఎవరైనా కావాలని నిప్పుపెట్టారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపడతామన్నారు.
Also Read : మరికొన్ని గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. కానీ, అంతలోనే ఏం చేశారంటే?
Follow Us