/rtv/media/media_files/2025/03/15/mJNeRY5uWHT6FtvbtArx.jpg)
Maoists surrender to telangana police
Maoist: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ పోలీసుల ఎదుట మరో 64 మంది లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మావోలకు పునారావాసం, ఉపాధికల్పనపై దృష్టిసారించండం సత్ఫలితాలిస్తుందని తెలంగాణ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.
పీఎల్జీఏ బెటాలియన్ -1 కమిటీ మెంబర్లు..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐజీ చంద్రశేఖర్ భద్రాధ్రికొత్తగూడెం జిల్లా, ఛత్తీస్ ఘఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు. అలాగే భధ్రతాబలగాలు అడవులను జల్లెడపడుతుండటంతోపాటు మరోవైపు ఆకురాలు కాలం కావడంతో సేఫ్ జోన్లు లేక మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన వారంతా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపుర్, సుక్మా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కమాండర్ గా వ్యవహరిస్తున్న పీఎల్జీఏ బెటాలియన్ -1 కమిటీ మెంబర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
ఇక మావోల లొంగుబాటుపైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, తెలంగాణ పోలీసులు ఓవైపు సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేస్తూనే మరోవైపు సరెండర్ల వైపు దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే రెండున్నర నెలల వ్యవధిలో భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట 122 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో త్వరితగతిన ప్రభుత్వం సరెండర్ పాలసీ అమలు చేస్తోంది. లొంగిపోయిన మావోలకు పునారావాసం, ఉపాధికల్పనపై దృష్టిపెడుతున్నామని తెలంగాణ మల్టీజోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలోఐజీ చంద్రశేఖర్ రెడ్డి, భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: విత్తనాలే కదా అని విసిరి పారేస్తున్నారా..ఈ విషయం తెలిస్తే ఏరుకుని మరీ తెచ్చుకుంటారు