/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/maoist-jpg.webp)
Maoists killed Hidma
BIG BREAKING: ఛత్తీష్‌గడ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. పెంటపాడుకు చెందిన పటేల్ కల్ము హిడ్మా(65)ను గొంతు కోసి చంపేశారు. భూ దందాలకు పాల్పడుతున్నాడనే కారణంగా శిక్షించినట్లు మృతదేహం వద్ద లేఖ వదిలి వెళ్లడం సంచలనం రేపుతోంది.
ఇంటి నుంచి ఎత్తుకెళ్లి..
ఈ మేరకు సోమవారం రాత్రి చింతగుఫా పోలీస్టేషన్ పరిధిలోని పెంటపాడు గ్రామ పటేల్ కల్ము హిడ్మా(65) ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే అదే రాత్రి కుంట ఏరియా కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు అతన్ని బలవంతంగా అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఊరి చివర హిడ్మాను కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. అయితే డెడ్ బాడీని గ్రామశివారులో వదిలేసిన మావోయిస్టులు.. మృతదేహం వద్ద లేఖ వదలివెళ్లారు.
గ్రామంలో భూ దందాలు..
హిడ్మా కొంతకాలంగా గ్రామంలో భూ దందాలకు పాల్పడుతున్నాడు. బలవంతంగా తన పేరిట పట్టాలు చేయించుకుంటున్నాడు. పద్దతి మార్చుకోవాలని చెప్పినా వినలేదు. అందుకే ఈ శిక్ష వేయాల్సి వచ్చింది. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇక సీపీఐ మాజీ ఎమ్మెల్యే మనీశ్కుంజాం మృతుడు హిడ్మాకు మామ అవుతాడని బంధువులు, సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. అయితే మావోయిస్టుల ఆరోపలు, చర్యలను మనీశ్కుంజాం తీవ్రంగా ఖండించారు.