బెంగళూర్‌లో ఓ టెకీ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న టెకీని ప్రశాంత్ నాయర్ గా పోలీసులు గుర్తించారు.వైవాహిక బంధంలో వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. మృతుడు లెనోవా లో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పూజా నాయర్ 12 ఏళ్లుగా డెల్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
వీరికి 8 ఏళ్ల కూతురు కూడాఉంది. బెంగళూర్‌లో చిక్కబనవారలో నివాసం ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ప్రశాంత్ ను ఆయన భార్య పూజా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నట్లు గుర్తించారు.ఈ జంట తరుచుగా గొడవపడుతున్నారని, విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తున్నారని తెలిసింది. భార్య ప్రశాంత్ ర్‌ని మానసికంగా బాధపెడుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read: Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ప్రశాంత్ నాయర్ ఆత్మహత్య చేసుకున్న రోజున, అతడి తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానించి అతను ఫ్లాట్‌కి వెళ్లి చూడగా, ఫ్యాన్‌కి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీని పై సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఏడాది జనవరిలో బెంగళూర్‌లో యూపీకి చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. 34 ఏళ్ల సుభాష్ 24 పేజీల సూసైడ్ లేఖతో పాటు గంటన్నర వీడియో రికార్డులో తన భార్య, ఆమె తల్లి ఎలా వేధిస్తున్న విషయాన్ని చెప్పాడు. ఈ వీడియో అందరి చేత కంటతడి పెట్టించింది. అక్రమంగా గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టారని అందులో ఆరోపించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
bengalore | benguluru techie news | suicide | dell | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates