Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్

బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ఈమె మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో సన్యాసంలోకి చేరింది. ఆమె యమయ్ మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. ఇటీవల ఇండియాకి వచ్చిన ఈమె ఎవరూ ఊహించని విధంగా సన్యాసంలో చేరింది.

New Update
Mamta Kulkarni

Mamta Kulkarni Photograph: (Mamta Kulkarni)

Mamta Kulkarni: బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఎవరూ ఊహించని విధంగా సన్యాసంలోకి మారిపోయింది. మహా కుంభమేళా సందర్భంగా ఆమె సాధ్విగా మారిపోయింది. ఇప్పటి వరకు మమతా కులకర్ణిగా ఉన్న ఆమె యమయ్ మమతా నందగిరిగా మారారు. వారణాసిలోని మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో చేరి ఆమె సాధ్విగా మారిపోయారు. అయితే మమతా గత రెండేళ్ల నుంచి కిన్నెర అఖాడాతో సంప్రదింపులు చేశారు. ఆమె మహామండలేశ్వరుడు పదవి కావాలని కోరడంతో ఇచ్చినట్లు మహామండలేశ్వరక లక్ష్మీ త్రిపాఠి తెలిపారు. 

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

ఇటీవల ఇండియాకి వచ్చిన ఈమె..

మమతా కులకర్ణి ఇటీవల ఇండియాకి వచ్చారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆమె గతేడాది ముంబైలో కనిపించారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఆమె వచ్చారని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ.. ఆమె సమస్యంలో కలిసిపోయారు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

1992లో కెరీర్‌ను ప్రారంభించిన కులకర్ణి అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చివరగా 2002లో సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఆ తర్వాత 2014లో ఆమెపై కొన్ని పుకారులు వచ్చాయి. ఓ డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించింది. అయితే మమతా కులకర్ణి 1998లో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌లతో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఇండియాకి వచ్చిన మమతా మహా కుంభమేళాలో సన్యాసం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు