/rtv/media/media_files/2026/05/05/mamata-benarjee-and-stalin-2026-05-05-15-07-44.jpg)
Mamata benarjee, stalin to get another chance to contest in bypolls
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో DMK చీఫ్ స్టాలిన్(stalin), TMC అధినేత్రి మమతా బెనర్జీ(mamta-benarjee) ఓడిపోయిన సంగతి తెలిసిందే. అధికారానికి దూరమైన ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు ఉప ఎన్నికల రూపంలో మళ్లీ పోటీ చేసే అవకాశం రానుంది. తమిళనాడులో చూసుకుంటే టీవీకే చీఫ్ విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసిన గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం ఆయన కచ్చితంగా ఓ స్థానానికి రాజీనామా చేయడం అనివార్యం కానుంది. అయితే విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు మళ్లీ ఆ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానుంది. మరోవైపు ఆ స్థానంలో సిని నటి త్రిషను కూడా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: AIDMKలో చీలిక.. విజయ్ కు 10 మంది MLAల సపోర్ట్.. అసలేం జరుగుతోంది?
Contest In Bypolls
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటి ఆసక్తికర సమీకరణాలే కనిపిస్తున్నాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ భవానీపూర్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె మరోసారి ఓడిపోయారు. అయితే సువేందు అధికారి కూడా రెండు చోట్ల పోటీ చేసి గెలిచారు. అలాగే మరో కీలక ముస్లిం నేత కూడా రెండు స్థానాల్లో పోటీ విజయం సాధించారు. దీంతో వీళ్లిద్దరూ కూడా చెరో స్థానాన్ని వదులుకోవాల్సి వస్తోంది. దీంతో మమతా బెనర్జీ ఆ ఖాళీ అయ్యే స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె గెలిస్తే మళ్లీ అసెంబ్లీ అడుగుపెట్టే ఛాన్స్ దక్కనుంది.
Also read: AIDMKలో చీలిక.. విజయ్ కు 10 మంది MLAల సపోర్ట్.. అసలేం జరుగుతోంది?
సీఎం హోదాలో ఉండి కూడా స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోవడం ఆయా రాష్ట్రాల్లో సంచలనం రేపింది. మమతా బెనర్జీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ టీఎంసీకి మెజార్టీ సీట్లు ఆమె సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా వివాదం సృష్టించిన డీలిమిటేషన్, హిందీ భాష అంశాలపై పోరాటం చేసిన స్టాలిన్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ప్రాధాన్యం సంతరించకుంది. మొత్తానికి సీఎం పదవి కోల్పోయిన ఈ ఇద్దరు కీలక నేతలకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానుంది. మరీ వీళ్లు పోటీ చేస్తారో ? లేదో ? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us