/rtv/media/media_files/2025/02/20/ubbqf0L6kmGau8lWA4eM.jpg)
Fire Accident
Fire Accident: తమిళనాడు(Tamil Nadu)లోని తిరువల్లూరు జిల్లా(Tiruvallur District) తిరుముల్లెవాయల్(Thirumullevayal)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీ(Chemical Factory)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కార్మికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా చల్లారలేదు. చివరికీ ఫ్యాక్టరీ పక్కనున్న కాలేజీకి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో బయటకు పరుగులు తీశారు.
Also Read: భారత్‌లో తగ్గిన ఆత్మహత్యల మరణాల రేటు..
Tiruvallur, Tamil Nadu: A massive fire broke out at a food manufacturing company in Thirumullaivayal. Despite efforts by employees to control it, the fire quickly spread, engulfing the entire building and causing significant damage to the company and the surrounding area pic.twitter.com/AVlCX588uc
— IANS (@ians_india) February 20, 2025
Also Read: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
ఫ్యాక్టరీకి భారీగా ఆస్తినష్టం..
సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పుతున్నారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీకి భారీగా ఆస్తినష్టం జరిగిట్లు తెలుస్తోంది. అక్కడ పనిచేసే సిబ్బంది ఈ ప్రమాదం నుంచి బయటపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో చాలాచోట్ల ఇలా అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన రేపుతోంది.
మంగళవారం హైదరాబాద్ కుషాయిగూడ (Kushaiguda) లో కూడా భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కుషాయిగూడ బస్ డిపోలో మంటలు చెలరేగడంతో రెండు ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కాలి బూడిదయ్యాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..