Sex chatting case: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!

పరాయి మగాళ్లతో పెళ్లైన మహిళల శృంగార ముచ్చట్ల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరోకరితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేసి విడాకులు మంజూరు చేసింది. 

New Update
sex chatting

MadhyaPradesh High Court key comments on married women sex chatting case

Sex chatting case: పెళ్లైన మహిళలు పరాయి పురుషులతో శృంగార ముచ్చట్లాడటం గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరో మగాడితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేస్తూ విడాకులు మంజూరు చేసింది. 

అసభ్యకరంగా వాట్సాప్ సంభాషణలు..

ఈ మేరకు 2018లో వివాహం చేసుకున్న ఓ వ్యక్తి ఇటీవల తన భార్యపై ఫిర్యాదు చేశాడు. పెళ్లి తర్వాత ఆ మహిళ తన మొబైల్‌లో పాత ప్రేమికులతో మాట్లాతుందని, వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని ఆరోపించారు. మగ స్నేహితులతో సెక్స్ లైఫ్ గురించి చాటింగ్ చేస్తోందని, తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో భర్తనే తనపై క్రూరత్వానికి పాల్పడ్డాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టులో కంప్లైంట్ చేసింది. ఫ్యామిలీ కోర్టు విడాకుల అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో అతను హైకోర్టుకు ఫిర్యాదు చేయగా.. జస్టిస్ వివేక్ రుషియా, గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. వివాహమైన తర్వాత భార్య లేదా భర్త తమ స్నేహితులతో అసభ్యకరమైన సంభాషణలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. 


Also Read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!

ఏ భర్త సహించడు..

'భార్య ఇతరులతో అసభ్యకరమైన చాటింగ్‌లు చేస్తుంటే ఏ భర్త కూడా సహించడు. వివాహానంతరం భార్యాభర్తలిద్దరికీ మొబైల్, చాటింగ్, ఇతర మార్గాల ద్వారా స్నేహితులతో సంభాషించడానికి స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆ సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవంగా ఉండాలి. ప్రత్యేకించి వ్యతిరేక లింగంతో ఉండే సంబంధం జీవిత భాగస్వామికి అభ్యంతరం కలిగించకుండా ఉండాలి' అని పేర్కొంది. ఇక ఎరికైనా అభ్యంతరం ఉన్నప్పుడు అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే అది ఖచ్చితంగా ఇతర భాగస్వామికి మానసిక క్రూరత్వాన్ని కలిగిస్తుందని కోర్టు తెలిపింది. 

Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్‌ ..లక్షలాది కొబ్బరికాయలతో...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack : ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.  

New Update
15 local cadres helped

15 local cadres helped

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో హిందువుల ఊచకోత తర్వాత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాద దాడి తర్వాత, భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు అక్కడ 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళను పేల్చేశాయి.  పుల్వామాలోని త్రాల్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాది అమీర్ నజీర్ ఇంటిని కూల్చివేశారు. అదే సమయంలో, పుల్వామాలోని ఖాసిపోరాలో జైషే ఉగ్రవాది అమీర్ నజీర్ వాని ఇంటిని పేల్చివేశారు. అంతకుముందు, షోపియన్ జిల్లాలోని వందినా ప్రాంతంలో ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇంటిని కూల్చివేశారు. అద్నాన్ షఫీ దాదాపు ఏడాది క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఇక కుప్వారాలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ ఇంటిని పేల్చివేశారు. వీటన్నింటినీ కలుపుకుని, ఇప్పటివరకు కశ్మీర్ లో మొత్తం 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళు నేలమట్టమయ్యాయి.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

15 మంది కశ్మీరీలే సహాయం

మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ NIAకి అప్పగించింది. ఇప్పుడు NIA జమ్మూ కశ్మీర్ పోలీసుల నుండి పహల్గామ్ కేసును టెకాఫ్ చేసింది. శ్రీనగర్‌లో, ఉగ్రవాద సహాయకులకు సంబంధించిన 64 ప్రదేశాలపై UAPA కింద చర్యలు తీసుకోబడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది.  ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.  ఉగ్రవాదులు ఎంటర్ కావడానికి మార్గనిర్దేశం చేశారని, దాడులలో ఉపయోగించడానికి పాకిస్తాన్ నుండి ఆయుధాలను కూడా సమకూర్చారని తెలుస్తోంది.  వారి అరెస్టుపై నిర్ణయం తీసుకునే ముందు కుట్రను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.  

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

Advertisment
Advertisment
Advertisment