🔴 Live Breakings: ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌ అవతరించింది.ఉత్కంఠగా సాగిన పోరులో టీమ్‌ ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుగ బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా..అనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

Also Read: Mark-carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌!

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 76 పరుగులతో చెలరేగి పోగా, శ్రేయస్ 48 పరుగులతో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. రాహుల్ 34 నాటౌట్‌, గిల్‌ 32 అక్షర్ పటేల్‌ 29 పరుగులతో అద్భుత విజయాన్ని అందించారు. భారత్‌ విజయం సాధించడం పట్ల కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. 

Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

మ్యాచ్‌ తరువాత కోహ్లీ మాట్లాడుతూ..ఇది అద్భుత విజయం..కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తరువాత మళ్లీ పుంజుకోవాలని అనుకున్నాం. ఏదైనా పెద్ద టోర్నీ గెలవాలనుకున్నాం.ఆ సమయంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం.జూనియర్‌ ఆటగాళ్లలో అద్భుతమైన ప్రతిభ ఉంది. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారు. సీనియర్లుగా అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేస్తుండడం సంతోషంగా ఉంది.

మా అనుభవాన్ని వారితో పంచుకుంటున్నాం. అయితే వారు తమదైన శైలిలో ఆడుతున్నారు. అదే భారత జట్టును బలంగాతయారు చేస్తోంది. ఒక మంచి జట్టులో భాగమైనందుకుసంతోషంగా ఉంది. ప్రాక్టీస్‌ సెషన్‌ లో ఎంతగానో కష్టపడ్డాం.విజేతగా నిలిచినందుకు ఎంతో  ఆనందంగా ఉందని కోహ్లీ అన్నాడు.

సుదీర్ఘమైనకెరీర్‌ ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో ఆడడాన్ని ఆస్వాదిస్తాం. టైటిల్‌ గెలవాల్సినప్పుడు జట్టు మొత్తం విభిన్నంగా ఆడాల్సి ఉంటుంది. గత ఐదు మ్యాచ్‌ ల్లో జట్టులోని సభ్యులు ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అందుకే ఈ రోజు మేము విజేతలుగా నిలిచాం. పలువురు ఆటగాళ్లు చాలా గొప్పగా వారి ప్రదర్శననిచ్చారు.సమష్టి ప్రయత్నంతో టైటిల్‌ ను గెలుపొందాం. ఒక బృందంగా ఆడి విజయం సాధించడాన్నిఆస్వాదిస్తున్నాను.ప్రాక్టీస్‌ సెషన్‌ లో ,ఫీల్డ్‌ లో , ఫీల్డ్‌ బయట మేము ఒక టీమ్ గా ఉండడం ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది.

గొప్ప స్థానంలో ఉండాలని...

మనం టీమ్‌ నుంచి వీడేప్పుడు జట్టు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాం. అందుకు ఎంతో కృషి చేసత్ఆం.రాబోయే 8-10 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మా జట్టు ఇప్పటికే సిద్ధమై ఉంది. యువ ఆటగాళ్లలో ఎంతో ప్రతిభ ఉంది.ఎంతోఅవగాహన ఉంది. వారు ఇప్పటికే ఎన్నో వేదికల్లో తమ ప్రదర్శనతో అదరగొట్టారు. గిల్‌, శ్రేయస్‌ అద్భుతమైన ఆటగాళ్లు. రాహుల్‌ ఫినిషర్‌ గా ఆకట్టుకుంటున్నాడు.హార్దిక్‌ మ్యాచ్‌ విన్నర్‌. ప్రస్తుతం మాకు అద్భుతమైన జట్టు ఉంది.

Also Read: HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

Also Read: Champions Trophy: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ఇదే..

  • Mar 10, 2025 12:24 IST

    ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

    మిర్యాలగూడ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్టీఎస్సీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్ హత్య కేసులో నిందితుల్లో ఏ2 సుభాష్ కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.

    BREAKING NEWS
    breaking news

     



  • Mar 10, 2025 11:39 IST

    బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు

    బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.

    somu virraju
    somu virraju Photograph: (somu virraju)

     



  • Mar 10, 2025 10:05 IST

    లలిత్ మోడీకి బిగ్ షాక్ .. పాస్‌ పోర్టు రద్దు!

    పరారీలో ఉన్న వ్యాపారవేత్త లలిత్ మోడీ వనాటు పౌరసత్వం రద్దు చేయబడింది. వనాటు ప్రధాని జోథమ్ నాపట్ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు.

    IPl
    Lalith Modi

     



  • Mar 10, 2025 10:04 IST

    తెలంగాణలో విషాదం.. 18 నెలల బాబు ప్రాణం తీసిన పల్లీ గింజ

    తెలంగాణలో 18 నెలల బాబు పల్లీ గింజ నోటిలో ఇరుక్కుని చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. చికిత్స తీసుకుంటూ ఆ బాబు మృతి చెందాడు. 18 నెలల కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు.

    months baby dead
    months baby dead Photograph: (months baby dead)

     



  • Mar 10, 2025 09:42 IST

    ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

    టీమ్‌ ఇండియా విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్ ..అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు.ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మన జట్టు కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని ట్వీట్‌ చేశారు.

    modicricket
    modicricket

     



  • Mar 10, 2025 09:42 IST

    ఏలూరులో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే 30 మంది!

    ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



  • Mar 10, 2025 09:41 IST

    రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాలో ప్రజలు జాగ్రత్త

    వాతావరణ శాఖ తెలంగాణలో అన్నీ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వనుందట. ఆదివారం (నిన్న) అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాలలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.]



  • Mar 10, 2025 09:41 IST

    ప్రేయసితో స్టేడియంలో చాహల్.. నెట్టింట వీడియో వైరల్

    ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ మరో అమ్మాయితో కనిపించాడు. ఇద్దరూ క్లోజ్‌గా నవ్వుకుంటూ మాట్లాడుకోవడంతో.. ఈ కారణంగానే ధన శ్రీతో విడిపోయారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసందే.

    Yuzvendra Chahal
    Yuzvendra Chahal Photograph: (Yuzvendra Chahal)

     



  • Mar 10, 2025 09:40 IST

    రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించిన షామా మొహమ్మద్ ఛాంపియన్ ట్రోఫీ గెలవగానే మెచ్చకున్నారు. 76 పరుగులతో టీంని ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు హ్యట్సాఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపింది. రోహిత్ బాడీ షేమింగ్‌పై షామా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.

    shama, rohit



  • Mar 10, 2025 08:07 IST

    ఇదో అద్భుత విజయం.. చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

    ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తరువాత కోహ్లీ మాట్లాడాడు.ఇది అద్భుత విజయం.ఈ విజయంలో జట్టు సమిష్టి కృషి ఉంది.యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో కలిసి ఆడడం చాలా బాగుంది. వారు జట్టును సరైన దిశలోనే ముందుకు తీసుకెళ్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

    kohli
    kohli

     



  • Mar 10, 2025 08:07 IST

    టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్

    టీమ్‌ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు.

    Suneel Gavaskar Dance video
    Suneel Gavaskar Dance video Photograph: (Suneel Gavaskar Dance video)

     



  • Mar 10, 2025 08:06 IST

    TBM ఆపరేటర్‌ గురుప్రీత్ డెడ్‌బాడీ.. తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

    SLBC టన్నల్‌లో టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం బయటపడింది. గురుప్రీత్ మృతిపట్లు CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. అతని కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. మృతదేహాన్ని పంజాబ్‌లోని ఆయన స్వస్థలానికి తరలిస్తున్నారు.

    slbc
    slbc Photograph: (slbc)

     



  • Mar 10, 2025 08:06 IST

    కెనడా కొత్త ప్రధానిగా మార్క్‌!

    కెనడాలో అధికార లిబరల్‌ పార్టీ నేతగా మార్క్‌ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తరువాత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్‌ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.

    mark
    mark

     



  • Mar 10, 2025 08:05 IST

    రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక ప్రకటన

    వన్డే క్రికెట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ కావడం లేదని తెలిపారు. 

    ICC Rohith
    ICC Rohith Photograph: (ICC Rohith)

     



  • Mar 10, 2025 08:04 IST

    సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

    సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యాన్ని ఆ పార్టీ ప్రకటించింది.రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తరువాత ఆయన పేరును ఆదివారం రాత్రి రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

    nellikanti
    nellikanti

     



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు