Lawyer: నడిరోడ్డుపై లాయర్‌ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్‌ మొరాయించడంతో?

ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని  మీర్జాపూర్‌లో మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన లాయర్‌ రాజీవ్‌ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై  కాల్చిచంపారు.

New Update
FotoJet (29)

Lawyer brutally murdered on the street.

ఇటీవల హంతకులు మరీ తెగిస్తున్నారు. తమ శత్రువు అనుకున్న వారిని ఎలాంటి భయం లేకుండా పట్టపగలు, నడి రోడ్లపై చంపడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌(uttarpradesh) లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని  మీర్జాపూర్‌లో మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన లాయర్‌ రాజీవ్‌ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై కాల్చిచంపారు(brutally-murdered). మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన రాజీవ్‌ సింగ్‌ నడుచుకుంటూ వస్తుండగా  బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగులు కాల్పులు జరిపిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

Also Read :  రోడ్డుపైనే పరీక్షలు.. వైరల్ అవుతున్న బీహార్ ఎగ్జామ్ వీడియో!

Lawyer Brutally Murdered

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన రాజీవ్‌ సింగ్‌(45) కోసం ఇద్దరు దుండగులు ఆయన వచ్చే మార్గంలో బైక్‌పై వచ్చి వేచి చూస్తున్నారు. రాజీవ్‌ సమీపానికి రాగానే వారిలో ఒకడు నాటుతుపాకీ పట్టుకొని ఆయన ఎదురుగా వెళ్లి అతి సమీపం నుంచి  కాల్పులు జరిపాడు. ఆయనకు బుల్లెట్‌ తగలగానే న్యాయవాది కింద పడిపోయాడు. రాజీవ్‌ మృతి చెందాడని నిర్ధరించుకున్న తర్వాత నిందితుడు అక్కడినుంచి వెళ్లి తనకోసం వెయిట్‌ చేస్తున్న  ఇంకోవ్యక్తి బైక్‌ ఎక్కాడు. అయితే ఆ బైక్‌ స్టార్ట్‌ చేయగా అది మొరాయించింది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరూ దాన్ని స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కొందరు వారిని పట్టుకోవడానికి పరిగెత్తుకొచ్చారు.  అయితే నిందితుల్లో ఒకడు తన వద్ద ఉన్న  తుపాకీ చూపించి వారిని బెదిరించారు. దీంతో వారు వెనుతిరిగారు. ఈలోగా బండి స్టార్ట్‌ అవడంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారైనట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇదిలాఉండగా లాయర్‌ రాజీవ్‌ గతంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ లోగానే ఆయన హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. - lawyer mur*der incident

Also Read :  మాములు స్కెచ్ కాదు.. నల్లగా ఉన్నావంటూ భర్తను లేపేసింది!

Advertisment
తాజా కథనాలు