Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ

పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌, సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయాలని ఆదేశించింది.

New Update
Baba Ramdev

Baba Ramdev

Baba Ramdev: యోగా గురువు, పతంజలి ఆయుర్వేద(Patanjali Ayurved) వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌, సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్టు చేయాలని ఆదేశించింది. పలు వ్యాధుల నివారణకు దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. 

Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

అయితే ఈ కేసులకు సంబంధించి బాబా రామ్ దేవ్, బాలకృష్ణ కోర్టు ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పాలక్కడ్ జిల్లా కోర్టు వాళ్లిదరిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల క్రితమే కేరళకు చెందిన కేవీ బాబు అనే ఆఫ్తమాలజిస్ట్ వైద్యుడు దీనికి సంబంధించి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అనంతరం కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లోఒక కేసు వాళ్లపై నమోదైంది. కేవీ బాబు దాఖలు చేసిన ఫిర్యాదులపై కేరళ ఔషద నియంత్రణ విభాగం చర్యలు మొదలుపెట్టింది. 

Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్

బాబా రామ్‌దేవ్(Baba Ramdev), బాలకృష్ణపై అరెస్టు వారెంట్

పతంజలికి సంబంధించిన కార్యాలయాన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్‌ (అభ్యంతకర యాడ్స్‌) చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఇదిలాఉండగా పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయని గతంలో యాడ్స్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా వీళ్లకు మొట్టికాయలు వేసింది. తప్పుడు ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెబుతూ యాడ్ ఇవ్వాలంటూ ఆదేశించింది. అయితే తాజాగా పాలక్కడ్ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్, బాలకృష్ణపై అరెస్టు వారెంట్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: కేసీఆర్, హరీశ్ లకు బిగ్ షాక్.. కాళేశ్వరం అవకతవకలపై కమిషన్‌ కీలక నిర్ణయం!

Also Read :  మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ పదేళ్ల నాగసాధు...!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు