Arvind Kejriwal: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బిలియనీర్లు తీసుకున్న రుణాలను కేంద్రం మాఫీ చేస్తోందంటూ మండిపడ్డారు. వాళ్ల రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఓ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి దీనిపై లేఖ రాశారు. బిలియనీర్లకు రుణాలు మాఫీ చేయడం వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి ఆయన వివరించారు.
Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్ షాకింగ్ ఆన్సర్..
కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..
ఈ అంశంపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ '' దేశంలో ధనవంతులు తీసుకున్న వేల కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తోంది. వాళ్లకే అనుకూలంగా ఉంటోంది. దీనివల్ల సాధారణ ప్రజలు అధిక పన్ను భారాన్ని భరించలేకపోతున్నారు. బిలియనీర్లకు మాత్రం లబ్ధి చేకురుతోంది. ప్రజలు తమకు వచ్చే జీతంలో నుంచి సగం మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తోంది.
Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!
సామాన్య పౌరులు తీసుకునే గృహ, వాహన ఇతర రుణాలను కేంద్రం ఎందుకు మాఫీ చేయడం లేదు ?. ధనవంతుల రుణమాఫీని కేంద్రం ఆపినట్లయితే సామాన్యులపై ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్ల భారాన్ని సగం వరకు తగ్గించవచ్చు. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని రెట్టింపు కూడా చేయవచ్చు. అలాగే నిత్యావసర వస్తువులపై ఉన్న జీఎస్టీని కూడా తొలగించవచ్చు. బిలియనీర్లకు రుణమాఫీ చేయడం అనేది భారీ స్కామ్. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని'' కేజ్రీవాల్ అన్నారు.
Also Read: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
ఇదిలాఉండగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈసారి ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా కేజ్రీవాల్ బిలియనీర్ల రుణమాఫీ అంశాన్ని లేవనెత్తడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: Vitamin D Injection: ఏడాదికి ఒకసారి విటమిన్ డి ఇంజెక్షన్‌తో లాభాలు