/rtv/media/media_files/2024/12/30/gYB85oFV3O8TGtfc8F52.jpg)
Arvind Kejriwal announces ₹18000 for priests
బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒకరిమాద ఒకరు విరుచుకుపడుతున్నాయి. నువ్వానేనా అన్నట్టు సాఉతున్న పోటీలో మాటల యుద్ధాలు చేసుకుంటున్నాయి రెండు పార్టీలు. తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇంతకు ముందు కూడా బీజేపీ సీఎం అభ్యర్ధి ఆమె అంటూ మాధురి బిజరీ మీద కౌంటర్లు వేశారు. ఇప్పుడు మరో విషయంపై బీజేపీని విమర్శలతో ముంచెత్తారు.
కేజ్రీవాల్ ఏమన్నారు...
రానున్న అఎంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వాళ్ళ పని అంతే అంటూ విరుచుకుపడ్డారు కేజ్రీవాల్. ఢిల్లీలో మంచి ప్రాంతాలతో పాటూ మురికి వాడలు కూడా చాలా ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ మురికి వాడలన్నీ నాశనం అయిపోతాయి అని అంటున్నారు కేజ్రీవాల్. మురికి వాడలను కూల్చాలని ఆ పార్టీ ప్లాన్ వేస్తోంది అని అన్నారు. షాకూర్ బస్తీ ప్రాంతంలో జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఈ కామెంట్ చేశారు. బస్తీలో ఉన్న ప్రజల కంటే బీజేపీకి భూ సేకరణపైనే ప్రేమ ఎక్కువని ఆయన విమర్శించారు. గత ఐదేళ్ళల్లో ఆ పార్టీ నేతలు ఎపుడూ బస్తీ ప్రజల దగ్గరకు వెళ్ళలేదని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం తెగ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పూర్తిగా ధనవంతుల పార్టీ అని విమర్శించారు కేజ్రీవాల్.
Also Read: TGSRTC: 5 లక్షల మందిని తీసుకెళ్ళిన టీజీఎస్‌ఆర్టీసీ