/rtv/media/media_files/2025/01/14/ehp3qUJ48vRXlJ1fnhEU.jpg)
jhammu kashmir Photograph: (jhammu kashmir)
సంక్రాంతి, కుంభమేళ పర్వదినాన జమ్మూకశ్మీర్‌లో పేలుడు సంభవించింది. రాజౌరీ జిల్లా నౌషేరాలోని భవానీ సెక్టార్‌లోని మక్రి ప్రాంతంలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో మంగళవారం ల్యాండ్ మైన్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. పెట్రోలింగ్ పార్టీ జీప్ ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ల్యాండ్ మైన్ పేలుడు సంభవించింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం గస్తీని నిర్వహిస్తున్న టైంలో ఒకరు ప్రమాదవశాత్తూ ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి, వారికి వెంటనే వైద్య సహాయం అందించారు.
Read also : ఒలింపిక్స్ మెడల్స్‌లో కల్తీ.. పతకాలు తిరిగి ఇచ్చేస్తున్న విజేతలు
అదృష్టవశాత్తూ, సైనికులకు తగిలిన గాయాలు ప్రాణాపాయం కాదని, వారందరూ నిలకడగా ఉన్నట్లు సమాచారం. తదుపరి చికిత్స కోసం సైనికులను వెంటనే సమీపంలోని వైద్య సదుపాయానికి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతం నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నందున హైసెక్యూరిటీ జోన్‌గా గుర్తించబడింది.