Indian Railways: అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌, ఆర్మీ సిబ్బందికి గుడ్‌ న్యూస్ చెప్పింది. వీళ్లు రిటైరయ్యాక ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికోసం రైల్వేశాఖ, సైన్యం కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్‌ కో ఆపరేషన్‌)ను అమల్లోకి తీసుకొచ్చాయి.

New Update
Indian Railways, Indian Army launch Framework to boost post retirement jobs for Agniveers, ex-servicemen

Indian Railways, Indian Army launch Framework to boost post retirement jobs for Agniveers, ex-servicemen

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌(agniveer), ఆర్మీ సిబ్బందికి గుడ్‌ న్యూస్ చెప్పింది. వీళ్లు రిటైరయ్యాక ఉద్యోగాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది. దీనికోసం రైల్వేశాఖ(indian-railways), సైన్యం కలిసి సహకార ముసాయిదా (ఫ్రేమ్‌వర్క్ ఆఫ్‌ కో ఆపరేషన్‌)ను అమల్లోకి తీసుకొచ్చాయి. దీనిప్రకారం అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బంది రిటైరయ్యాక రైల్వేశాఖలో వారికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. దీనిపై అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. స్పెషల్ హెల్ప్‌లైన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి రైల్వేశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.  

Also read: బీజేపీ10 సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..కేజ్రీవాల్  సవాల్!

Indian Army Launch Framework To Boost Post Retirement Jobs

రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికి రైల్వేశాఖలో లెవల్ 2, అంతకన్నా ఎక్కువ స్థాయి పోస్టుల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. లెవల్ 1 పోస్టుల్లో మాజీ సైనిక సిబ్బందికి 20 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. అలాగే రిటైర్డ్ అగ్నివీర్‌లకు లెవల్ 2(ex-servicemen), అంతకన్నా ఎక్కువ స్థాయి పోస్టుల్లో అదనంగా 5 శాతం, లెవల్ 1 పోస్టుల్లో 10 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. 

Also Read: పాక్‌ F-16 ఫైటర్‌ జెట్‌ను కూల్చేసిన అఫ్గానిస్థాన్‌ !.. వీడియో వైరల్

అంతేకాదు సాధారణ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యేదాకా వేగంగా భర్తీలు చేపట్టడం కోసం ఆర్మీ మాజీ సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన పాయింట్స్‌మెన్‌గా నియమించుకుంటామని రైల్వేశాఖ తెలిపింది. దీనికోసం సంబంధిత ఆర్మీ సంస్థలతో కలిసి తొమ్మిది రైల్వే డివిజన్లు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

#telugu-news #Indian Army #indian-railways #rtv-news #agniveer #latest-telugu-news #ex-servicemen #national news in Telugu
Advertisment
తాజా కథనాలు