/rtv/media/media_files/2025/03/23/bFdlb9AUveBiIfAPDlCb.jpg)
Indian border AI-based robot surveillance
బార్డర్‌లో మరింత కట్టుదిట్టమైన భద్రత కోసం భారత ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత కోసం అస్సాంలోని గువాహటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశోధకులు AI ఆధారిత రోబోలను డెవలప్ చేశారు. సవాళ్లతో కూడిన సరిహద్దులను పర్యవేక్షించడానికి ఏఐ (AI) ఆధారిత నిఘా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు డీఏ స్పాటియో రోబోటిక్ లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ (DSRL) స్టార్టప్ డెవలప్ చేసిన రోబోలు రక్షణ, అభివృద్ధి సంస్థ నుంచి గుర్తింపు పొందినట్లు సమాచారం.
Also Read : SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్..
ఈ మేరకు ఇప్పటికే భారత సైన్యం ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎస్‌ఆర్‌ఎల్ సీఈఓ (CEO) అర్నబ్ కుమార్ బర్మాన్ దీని గురించి వివరించారు. 'మనుషుల గస్తీపై ఆధారపడే భద్రతా చర్యలకు భిన్నంగా ఈ రోబోలు స్వయంప్రతిపత్తి వ్యవస్థను కలిగి ఉంటాయని తెలిపారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పారు.
Also Read: TG Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య.. వేటాడి వెంటాడి గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
‘నావిగేషన్, AI-ఆధారిత నిఘాతో ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక రక్షణ విషయాల్లో ఓ విప్లవాత్మక మార్పు తీసుకోస్తుందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి AI ఆధారిత పరికరాలను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. అలాగే అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్‌లు, దుండగులు చొరబాట్లకు యత్నిస్తే ఈ రోబోల సెన్సర్లు వెంటనే గుర్తించి అలర్ట్ చేస్తాయని తెలిపారు.
Also Read: Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?
Also Read : కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్త ఏ చేశాడంటే!
ndia | robo | today telugu news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu