/rtv/media/media_files/2026/02/18/hilite-2026-02-18-13-26-16.jpg)
HiLITE Group gifts 47 cars worth 20 crore rupees to employees
సాధారణంగా కంపెనీలు తాము అనుకున్న లక్ష్యాలు సాధిస్తే ఉద్యోగులకు బోనల్‌లు ప్రకటిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు పలు బహుమతులు ఇస్తుంటాయి. అయితే కేరళ(kerala) లోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసి కార్లను గిఫ్టులుగా అందించింది. హైలెట్ గ్రూప్(HiLITE Group) అనే సంస్థ(company) ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఖరీదైన కానుకలు అందజేసింది. కేరళలో రిటైల్ స్పేస్ రంగంలో ఈ సంస్థ అగ్రగ్రామిగా కొనసాగుతోంది.
Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. షెడ్యూల్ ఎప్పుడంటే?
HiLITE Group Gifts 47 Cars To Employees
1996లో హైలైట్ గ్రూప్ కంపెనీని స్థాపించారు. ఇటీవలే ఈ సంస్థ 30 ఏళ్ల వార్షికోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువై కార్లను బహుమతులుగా ఇచ్చింది. ఈ కంపెనీ ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్న 47 మందికి వీటిని అందజేసింది. ఇందులో రేంజ్ రోవర్, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా, ఆడీ క్యూ8 లాంటి మోడళ్లు ఉన్నాయి.
Also Read: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కూతురు, సోదరి మధ్య వారసత్వ పోటీ
అంతేకాదు 2030 నాటికి తమ కంపెనీని మరింత విస్తరిస్తామని హైలైట్ గ్రూప్ యాజమాన్యం తెలిపింది. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామి ఇచ్చింది. ఈ కంపెనీకి త్రిశూర్, కాలికట్లలో లగ్జరీ మాల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో మరో 10 మాల్స్‌కు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 10 వేల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో 680 మిలియన్ డాలర్ల ఖర్చుతో భారీ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Follow Us