Delhi: డేంజర్ లో ఢిల్లీ.. హర్యానా నుంచి విషపు నీరు?

ఢిల్లీ డేంజర్ లో ఉందా అంటూ అవుననే అంటోంది ఆప్.  నగరానికి సరఫరా చేసే నీటిలో విషం కలుపుతున్నారని..హర్యానా నుంచి ఈ నీరు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదంతా బీజేపీ పనేనని అంటున్నారు. వీటిని బీజేపీ ఖండించింది.

author-image
By Manogna alamuru
New Update
Delhi

Delhi Elections

ఢిల్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బీజేపీ, అధికార పార్టీ ఆప్ లు పోటీపోటీగా ప్రారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బీజేపీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో గందరగోళం సృష్టించే ప్రయత్నంలో నగరానికి వస్తున్న నీటిలో విషయం కలిపారని ఆయన అన్నారు. నిన్న కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ చరిత్రలో ఎన్నడూ, ఎవ్వరూ చేయని పని చేసిందని అన్నారు. ఢిల్లీకి పొరుగు రాష్ట్రమైన హర్యానాలో అధికారంలో ఉన్న ఆ పార్టీ...యమునా నదిలో విషపూరితమైన పదార్ధాలను కలిపిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

అమ్మోనియా కలిపారు...

ఢిల్లీ ప్రజలకు హర్యానా, ఉత్తరప్రదేశ్ ల నుంచి తాగునీరు అందుతుంది.అయితే హర్యానా ప్రభుత్వం యమునా నది నుంచి ఢిల్లీకి వచ్చే నీటిలో అమ్మోనియా అనే విష పదార్ధం కలిపి ఇక్కడికి పంపింది. దీనిని తాము ముందే గుర్తించామని...అందుకే ఈ నీటిని నిలిపివేసినట్లు జల్ నిఘా బోర్డు ఇంజనీర్లు తెలిపారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే నీటని ఆపేశామని చెప్పారు. ఇలాంటి చర్యలు పూర్వం యుద్ధాల సమయంలో చేసేవారు. కానీ బీజేపీ ఇప్పుడు చేస్తోంది. విషపూరితమైన నీటి ద్వారా ఢిల్లీలో గందరగోళం సృష్టించి...ఆ తప్పును తమ ప్రభుత్వం మీద వేయాలని బీజేపీ చూసిందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అందుకే యమునా నదిలో అమ్మోనియా స్థాయిలు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. 

ఖండించిన బీజేపీ..

అయితే కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ కొట్టేసింది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీ వీటిని ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఫ్యాక్టరీ అని.. యమునా నది ఢిల్లీలోకి ప్రవేశించే ప్రదేశానికి జర్నలిస్టులను, నిపుణులను తీసుకెళ్లి నీటి నాణ్యతను తనిఖీ చేయండి అని సవాల్ చేశారు. అలాగే ఢిల్లీలో నదిలో నీటిని కూడా పరిశీలించమని..ఢిల్లీలో నదిని శుభ్రం చేయడం మా పని కాదు.. అది కేజ్రీవాల్ చేయలేకపోయిందని కార్మిక మంత్రి అనిల్ విజ్ అన్నారు. 

మరోవైపు యమునానది నీటిపై  ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి,  భగవంత్ మాన్‌తో సహా ఆప్ నేతలు ఈరోజు ఉదయం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన ఎన్నికల సంఘం.. రేపటి మధ్యాహ్నానికి అంటే జనవరి 28 నాటికి హర్యానా ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరింది. 

Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు