/rtv/media/media_files/2025/02/18/9ykYfUAdBgBuclgqfeHf.jpg)
gyanesh kumar
CEC: కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.ప్రస్తు సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుండడంతో నూతన సీఈసీని సోమవారం ఎంపిక చేశారు.
Also Read: ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..?
అంతకుముందు ఇదే అంశం పై సమావేశమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తదుపరి సీఈసీ పేరును ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ ఈ భేటీలో పాల్గొన్నారు. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా నియమితులైన జ్ఙానేశ్ కుమార్...2029 జనవరి 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Also Read: Sam Pitroda: 'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
మరో వైపు డాక్టర్ .వివేక్ జోషి ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు.
ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే..
జ్ఙానేశ్ కుమార్ కేరళ కేడర్ కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన...ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్ గా వ్యవహరిస్తున్నారు. మరో కమిషనర్ గా ఉన్న సుఖ్‌బిర్ సింగ్ సాంధూ ఉత్తరాఖండ్ కేడర్ కు చెందిన వారు.
జ్ఙానేశ్ కుమార్ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పని చేశారు.కశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీ గా ఉన్న ఆయన...ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
సుప్రీం కోర్టులో అయోధ్య రామజన్మభూమి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను నిర్వహణ బాధ్యత వహించారు.గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి పదవీ విరమణ పొందారు. గతంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవీ విరమణ అనంతరం అత్యంత సీనియర్ గా ఉన్న ఎన్నికల కమిషనర్ ను సీఈసీగా నియమించే వారు. గత సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన నూతన చట్టం ప్రకారం అన్వేషణ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను రూపొందించింది. దాని గురించి ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, ఈసీలను నియమిస్తుంది.
ఇదిలా ఉంటే కొత్త సీఈసీ ఎంపిక భేటీ నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్ గట్టిగా పట్టుపట్టింది.సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఫిబ్రవరి 19న సుప్రీం కోర్టు విచారించనున్నందున దీన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వీ కోరారు.
సీఈసీ సెలక్షన్ కమిటీ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలతో ప్రభుత్వం నియంత్రణ కోరుకుంటున్న విషయం అర్థం అవుతుందని అన్నారు. అయితే ఈ భేటీకి రాహుల్ గాంధీ హాజరయ్యారని చెప్పినప్పటికీ..ఏం మాట్లాడారనే విషయాన్ని మాత్రం సింఘ్వీ వెల్లడించలేదు.
Also Read: Delhi: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్
Also Read: GBS: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన!