/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
అక్రమంగా అమెరికాకు వెళ్తున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపిస్తున్న విషయం తెలిసిందే. భారతీయులు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ కొందరు ప్రమాదకరమైన డంకీ మార్గాల్లో అగ్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్ కు చెందిన ఓవ్యక్తి కుటుంబంతో సహా డంకీ రూట్ లో అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది.
Also Read: AP Weather: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త
మృతుడిని గుజరాత్ లోని సబర్‌కాంఠా జిల్లాలోని మోయద్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ గా గుర్తించారు.దిలీప్ పటేల్ అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనతో ఇటీవల ఓ ఏజెంట్ ను సంప్రదించారు.తన భార్య,చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి రూ. కోటి చెల్లించాలని వారు కోరడంతో తమ భూమిని విక్రయించి..వచ్చిన రూ. కోటి చెల్లించినట్లు స్థానికులు పేర్కొన్నారు.
Also Read: Bihar: పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి...25 కోట్లు దోచేశారు!
రెండు నెలల క్రితం అతడు కుటుంబంతో సహా టూరిస్ట్ వీసా పై దుబాయ్ వెళ్లి , అక్కడి నుంచి నికరాగ్వాకు వెళ్లాడు. అక్కడి నుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తుడైన దిలీప్ అనారోగ్యానికి గురయ్యారు.ఆ సమయంలో అతడికి మందులు లభించకపోవడంతో అనారోగ్యం తీవ్రమై కోమాలోకి జారుకొని మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు.
కాగా మృతుడి భార్యబిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఈ సంఘటన పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు.
ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారి గుర్తింపు ,తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.
Also Read:Cyber Crimes: సైబర్ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి
Also Read: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!