UNION BUDGET 2025: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

బంగారు ఆభరణాలపై 2025 బడ్జెట్‌లో కేంద్రం టారిఫ్ డ్యూటీ 5 శాతం తగ్గించింది. గోల్డ్ ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. ఇక బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శనివారం BSEలో గోల్డ్ స్టాక్స్ 9 శాతానికి పైగా లాభపడి గోల్డ్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

New Update
gold rates

gold rates Photograph: (gold rates)

పసిడి ప్రియులకు కేంద్ర బడ్జెట్ 2025 (Union Budget 2025) లో గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై టారిఫ్ డ్యూటీని 20 శాతానికి తగ్గించింది. 25శాతంగా ఉన్న టారిఫ్ డ్యూటీని 20శాతానికి తీసుకువచ్చారు. దీంతో బంగారు ఆభరణాల ధరలు (Gold Rates) తగ్గనున్నాయి. ఇండియాలో గోల్డ్ ఆభరణాల కొనుగోలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు బీఎస్ఈలో ఉన్న గోల్డ్ స్టాక్స్ 9 శాతానికి పైగా లాభపడ్డాయి. గోల్డ్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

Read also :Nirmala Sitharaman: బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్

Also Read :  2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Gold Rates - Union Budget 2025

అలాగే ప్లాటినం ఫైండింగ్ పై టారిఫ్ డ్యూటీని కూడా 25 శాతం నుంచి 5శాతానికి తగ్గించడం చాలా గొప్ప విషయమని, దీంతో రత్నాలు, వజ్రాల పరిశ్రమ మెరుగుపడుతుందని వ్యాపారస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలైలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పెరిగింది.

Also Read: 2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

Also Read :  కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? :  ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. రంగంలోకి సీఎం రేవంత్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు