/rtv/media/media_files/2026/03/30/flash-floods-in-afghanistan-kills-17-2026-03-30-06-47-56.jpg)
Flash floods in Afghanistan kills 17
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాల్లో ఉన్న 34 ప్రావిన్సులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయని అఫ్గాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి యూసఫ్ హమ్మద్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో 147 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. అలాగే 80 కిలోమీటర్ల వరకు రోడ్లు కొట్టుకుపోయినట్లు తెలిపారు.
Also Read: అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇరాన్.. శత్రువుల రాకను పసిగట్టే అవాక్స్ విమానం ధ్వంసం
Flash Floods In Afghanistan
రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పర్వత ప్రాంతాల్లో ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. అయితే అఫ్గానిస్థాన్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మట్టితో నిర్మించిన ఇళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
Also Read: అమెరికా సైన్యాన్ని బూడిద చేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
Follow Us