/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-12-22-07.jpg)
Bus accident in jammu and kashimir
Bus Accident: జమ్మూ-కశ్మీర్(Jammu and Kashmir) రాష్ట్రం ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ఒకటి నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. జిల్లాలోని జాలో అనే ప్రాంతానికి చేరుకోగానే, కొండ ప్రాంతంలోని ప్రమాదకరమైన మలుపు వద్ద దారి సరిగ్గా కనిపించకపోవడంతో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. బస్సు సుమారు వంద అడుగుల లోతులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
Also Read : దక్షిణాదిపై జనసేన గురి... జాతీయ పార్టీగా ఎదిగేందుకు కీలక అడుగులు
Fatal Accident In Jammu And Kashmir
Just now spoke to DC Udhampur, Sh Minga Sherpa after learning about a tragic road accident, less than an hour ago, at village Kanote, involving a public transport bus on way from Ramnagar to Udhampur .
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 20, 2026
The rescue operation has been immediately undertaken. Heavy casualties…
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ,సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉధంపూర్ డీఐజీ శివకుమార్ శర్మ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన 20 మందిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషాద ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్(union-minister-jitendra-singh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జిల్లా డిప్యూటీ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. స్థానిక యంత్రాంగానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు.
Also Read : శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇద్దరు అమెరికా పౌరుల అరెస్ట్.... తనిఖీల్లో సంచలన వస్తువులు
Tragic road accident in Udhampur is heartbreaking. My deepest condolences to bereaved families. May God grant them strength. Praying for speedy recovery of injured. I have directed district admin, Police, SDRF & Health Dept to provide every possible assistance to those affected.
— Office of LG J&K (@OfficeOfLGJandK) April 20, 2026
అలాగే, జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. "ఉధంపూర్ బస్సు ప్రమాదం గుండెలను పిండేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన ఆకాంక్షించారు.ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతుల వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో ఉధంపూర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Follow Us