/rtv/media/media_files/2025/03/21/eST1apyns7oikowc3lE1.jpg)
Social Media X
భారత కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ ఫామ్ లు కొట్టుకుంటున్నాయి. ఎక్స్ లో కంటెంట్ ను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంటే...దానిని వ్యతిరేకిస్తోంది ఎక్స్ యాజమాన్యం. దీనికి సంబంధించి తాజాగా కర్ణాటక హైకోర్ట్ లో పిటిషన్ కూడా దాఖలు చేసింది. చట్ట విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం కంటెంట్‌ను నియంత్రిస్తోందని.. ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతుందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా వేసింది. ఐటీ చట్ట ప్రకారం భారత ప్రభుత్వం బ్లాక్ చేసిన కంటెంట్ తొలగించకపోతే ఎక్స్ తన చట్ట బద్ధమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉందని చెప్పింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమ ఐటీ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎక్స్ యాజమాన్యం చెబుతోంది. ఇది అనధికారంగా తమపై సెన్సార్ చేయడమేనని తన పిటిషన్ లో పేర్కొంది.
గ్రోక్ పై దృష్టి పెట్టిన కేంద్రం
మరోవైపు ఎక్స్ ఏఐ అయిన గ్రోక్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల కొంతమంది వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ చాట్‌బాట్ హిందీ యాసలోనే కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ.. ఈ గ్రోక్ వివాదంపై ఎక్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు యత్నిస్తు్న్నామని అధికారులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ ఈ గ్రోక్ చాట్‌బాట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ భూమిపై అత్యంత తెలివైన ఏఐ టూల్ అని ఎలాన్ మస్క్ అన్నారు. అయితే ఇటీవల యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు అందరూ ఆశ్చర్యపోయేలా చేశాయి.