/rtv/media/media_files/2026/02/17/election-commission-2026-02-17-18-36-56.jpg)
Election Commission
ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు(assembly-elections) జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎన్నికల కమిషన్(election-commission) వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్యలో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే పర్యటన మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్లు అస్సాంలో ఉన్నారు.
Also Read: బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్ :ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు.. ఇక ట్యాబ్లెట్లు బంద్!
Election Schedule For 4 States
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాంలో పదవీకాలాలు మేలో ముగియనున్నాయి. ఇక పుదుచ్చేరిలో అసెంబ్లీ పదవీకాలం జూన్ 15న ముగియనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ముగింపు దశకు కూడా చేరుకుంది. పుదుచ్చేరిలో ఇప్పటికే ఫిబ్రవరి 14న తుది జాబితా విడుదలయ్యింది. మిగిలిన రాష్ట్రాలవి కూడా త్వరలో విడుదల కానున్నాయి.
Also Read: నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు..లొంగిపోవాలని ఆదేశం
Follow Us