/rtv/media/media_files/YJL9u55uOdRcxQXJoJlt.jpg)
ఓటర్ కార్డుని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంలో ముందడుగు పడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ రెండింటి అనుసంధానానికి కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే ఓటర్ కార్డుని, ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ దిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని, ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు.
Also Read: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
Aadhaar And Voter Linking
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6)లోని నిబంధనల ప్రకారం.. ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో అనుసంధానంపై అధికారులు చర్చించారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగానే ఈ ప్రక్రియను చేపట్టనున్నామని ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు యూఐడీఏఐ అధికారులు, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులు త్వరలో చర్చలు జరపాలని ఈ మేరకు నిర్ణయించారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసే అంశంపై ఎన్నికల కమిషన్ చట్టబద్ధతపై రాజకీయ పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం అంశంపై ప్రశ్నలు సంధించారు. దశాబ్దాల కాలం నుంచి భారత దేశ రాజకీయాల్లో ప్రధాన సమస్య నకిలీ, బోగస్ ఓట్లు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈసీ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ నకిలీ ఓట్లను పూర్తిగా అరికట్టలేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి.
ఒకే నంబర్‌తో పదుల సంఖ్యలో ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని ప్రతిపక్షాలు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నాయి. గతేడాది జరిగిన హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓట్లతోనే బిజెపి విజయం సాధించిందని కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో కేంద్ర సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో బోగస్ ఓట్లకు చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
Also Read: Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!