Prajapoll Survey: తమిళనాడులో, పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీలదే అధికారం.. సంచలన సర్వే

తమిళనాడులో ఈసారి కూడా డీఎంకే పార్టీ అధికారంలోకి రానుందని ప్రజాపోల్‌ అనే సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవనుందని అంచనా వేసింది.

New Update
Elections

Elections

తమిళనాడు(tamilnadu) లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజాపోల్‌ అనే సర్వే(Prajapoll Survey) సంస్థ తన ప్రీ పోల్‌ సర్వే ఫలితాలు రిలీజ్ చేసింది. ఈసారి కూడా డీఎంకే పార్టీ అధికారంలోకి రానుందని పేర్కొంది. 234 స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 117 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. DMK నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయెన్స్‌ (SPA) మొత్తం 150 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది.   

Also Read: ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం

SPA కూటమిలో డీఎంకేకు 117, కాంగ్రెస్ 16, DMDK 7, VCK 4, CPI 3, CPM, IUMLకు ఒక్కో స్థానం దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రజాపోల్‌ సర్వే వెల్లడించింది. ఇక విపక్ష కూటమి కేవలం 70 స్థానాలకే పరిమితం అవుతందని పేర్కొంది. ఇందులో ప్రధాన పార్టీ అన్నాడీఎంకేకు 53 స్థానాలు, బీజేపీకి 9, పీఎంకే 7, ఏఎంఎంకేకు ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే తెలిపింది. ఇక విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 14 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. 

Also Read: ప్రధాని మోదీ 'ఉగ్రవాది'.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌ గెలవనున్న బీజేపీ

ఇక పశ్చిమ బెంగాల్‌(west bengal) లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని ప్రజాపోల్‌ అనలిటిక్స్‌ సంస్థ (PPA) వెల్లడించింది. మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 167 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ.. ఈసారి 126 స్థానాలకే పరిమితమవ్వనున్నట్లు పేర్కొంది. ఇతరులు కేవలం ఒక్క స్థానంలో గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది.  ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర అగ్రనేతలందరూ అక్కడ జోరుగా ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23న, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు