/rtv/media/media_files/2025/02/22/xJzd9JStGOjWWXkAdkJI.jpg)
digital bath
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొవడానికి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు.
Also Read: Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు
కానీ, చాలా మంది వివిధ కారణాల వల్ల మహా కుంభమేళాలో పాల్గొనలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. అయ్యో కుంభమేళాలలో పాల్గొనలేకపోయామే అనే బాధ లేకుండా భక్తులకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించాడు. అసలు ఈ డిజిటల్ స్నానం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? కుంభమేళాకు హాజరుకాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సా్ప్ లో పంపాలని, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని ఓ యువకుడు వెల్లడించాడు.
Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇
— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025
pic.twitter.com/qGBr168p0f
కుంభమేళాలో డిజిటల్ స్నానం...
తన స్టార్టప్ పేరు ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ అని పేర్కొన్నాడు.డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ వీడియోలో డిజిటల్ స్నానాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. భక్తులు డిజిటల్ స్నానాల కోసం రూ. 1100 చెల్లించాలని.. అప్పుడు వారి ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచడం ద్వారా కుంభమేళాలో డిజిటల్ స్నానం ఆచరించేలా చేస్తామని తెలిపాడు. ఈ వ్యవహారంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
వ్యాపార ఐడియా అదిరిపోయిందంటూ కొందరు, టెక్నాలజీని వాడేస్తున్నావ్ బాసు అంటు మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Also Read: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!