/rtv/media/media_files/2025/02/14/MlhWB8PbWsMIkWselTd3.jpg)
Robbery in CBI Office, Tripura
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డేవారికి ఈ పేరు వింటేనే హడలిపోతారు. అయితే ఓచోట మాత్రం ఏకంగా సీబీఐ ఆఫీసులోనే చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆ కార్యాలయంలో చోరీకి పాల్పడ్డ దొంగలు ఉన్నదంతా దోచుకెళ్లారు. కబోర్డులు, కిటికీలు, స్టీల్ వస్తువులు ఇలా ఏవి దొరికితే వాటిని అందినకాడికి దోచుకొని వెళ్లారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనేదే కదా మీ డౌట్. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
ఇక వివరాల్లోకి త్రిపుర రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ష్యామలీ బజార్ క్వార్టర్ కాంప్లెక్స్‌లో ఉన్న సీబీఐ ఆఫీసులో దొంగలు పడ్డారు. డోర్లు, కిటికీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టీల్ సామగ్రీ ఇలా అన్నింటిని దోచుకెళ్లారు. ఆ ఆఫీసులో ఒట్టి గోడలు తప్ప ఏమీ మిగలలేదు. అయితే ఆ ఆఫీసు ఐదు నెలలుగా మూసి ఉంది. ఇటీవలే సీబీఐ అధికారులు ఆ బ్రాంచ్‌కు వెళ్లారు. గదిలో వస్తువులు ఏమీ లేకపోవడం చూసి షాకైపోయారు.
Also Read: మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. కన్వర్టెడ్ అంటూ!
ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికీ త్రిపుర రాజధాని అగర్తల దగ్గర్లో ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వాళ్ల నుంచి కొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వస్తువులను సేకరించేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ చోరీ వెనుకు ఇంకా ఏదైనా కారణం ఉందా ? అనేదానిపై ఆరా తీస్తున్నారు.
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్