/rtv/media/media_files/2025/04/10/YBcLeU729zqPdfNf9CNA.jpg)
Couple Elopes Leaving Spouses, Nine Children Behind In UP
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థనగర్ జిల్లాలోని మహరియా గ్రామానికి చెంది గీతకు ఐదుగురు సంతానం. అలాగే అదే గ్రామానికి చెందిన గోపాల్ నలుగురు పిల్లలకు తండ్రి.
Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
Couple Elopes Leaving Spouses
అయితే గీత, గోపాల్‌కు ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో వారం రోజుల క్రితం వీళ్లిద్దరూ తమ జీవిత భాగస్వాములు, పిల్లలను వదిలపెట్టి తమ ఇళ్లల్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5న గీతతో దిగిన ఫొటోలను గోపాల్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ సమాచారం తెలియడంతో ఇరు కుటంబాలతో పాటు గ్రామస్థులు షాక్ అయిపోయారు.
దీంతో గీత భర్త శ్రీచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కష్టపడి సంపాదించిన రూ.90 వేల నగదు, ఇంట్లో ఉన్న నగలు తీసుకుని గీత పారిపోయిందని చెప్పాడు. ఇక గోపాల్ భార్య అయితే.. తన భర్త చనిపోయిడని ప్రకటించింది. గోపాల్ ఎక్కడైనా ఉండొచ్చని.. కానీ తన పిల్లల కోసం వాళ్ల హక్కు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. వాళ్ల పోషణకు ఆర్థికంగా బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
Uttar Pradesh | latest telangana news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | couples