/rtv/media/media_files/2026/04/18/congress-mla-vinay-kulkarni-and-16-others-sentenced-to-life-imprisonment-2026-04-18-06-50-13.jpg)
Congress MLA Vinay Kulkarni, 16 others sentenced to life imprisonment
కర్ణాటక(karnataka) లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. ఓ హత్య కేసులో చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 16 మందికి జీవిత ఖైదు విధించింది. అలాగే వీళ్లందరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2016 జూన్ 15న ధార్వాడ జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ నేత యోగేశ్ గౌడ హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు 2020 నవంబర్ 5న ఏ15గా ఉన్న నిందితుడు వినయ్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
Congress MLA Vinay Kulkarni Life Imprisonment
ఆ తర్వాత కులకర్ణి సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ వేసి బెయిల్ మీద బయటికొచ్చారు. అయితే ధార్వాడ జిల్లాలో ఆయన అడుగు పెట్టరాదనే బెయిల్ కండిషన్ ఉంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. అయినప్పటికీ ఆయన భార్య, ఇద్దరు కుమార్తెల ప్రచారం చేయడంతో ఎన్నికల్లో గెలిచారు. చివరికి మళ్లీ దీనిపై చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. తాజాగా ఆయనతో పాటు మరో 16 మందికి కోర్టు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది.
Also Read: కన్నతండ్రే కాలయముడు...ముక్కు,నోరు మూసి చిన్నారిని చంపేసి..
నిందితుల నుంచి వచ్చే జరిమానాను యోగేశ్ గౌడ కుటుంబ సభ్యులకు, ఆయన సోదరుడు గురనాథగౌడకు అందించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ తీర్పు వెలువడ్డ తర్వాత ధార్వాడ ఎమ్మెల్యే స్థానం నుంచి వినయ్ అనర్హుడైనట్లు విధానసభ కార్యదర్శి ప్రకటన చేశారు. ఇదిలాఉండగా వినయ్ కులకర్ణి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిచారు. ఓసారి మంత్రిగా పనిచేశారు.
Follow Us