/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
Coimbatore 7 college students arrested for gang rape of 17 year old girl
ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా కామ కోరికలతో కొంత మంది రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తమ కోరికలు తీర్చుకునేందుకు కనిపించిన వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తల్లి, చెల్లి, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. కొందరు విద్యార్థులు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ (Gang Rape) కు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
17 ఏళ్ల బాలికపై కన్ను
తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూరు జిల్లాలోని ఉక్కడం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ ఫెయిలై తన బామ్మ ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆ బాలికకు సోషల్ మీడియాలో కునియముత్తూరు ప్రాంతానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అలా కొద్ది రోజులు చాటింగ్ చేసుకున్నారు. ఈ తరుణంలోనే ఆ విద్యార్థి.. బాలికపై కన్నేశాడు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
రూమ్‌కి పిలిపించి
ఎలాగైనా ఆమెపై కామవాంఛ కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆదివారం కునియముత్తూరులో ఉన్న తన రూమ్‌కు రప్పించుకున్నాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. అక్కడితో ఆగకుండా తనకు తెలిసిన మరో 6గురు స్నేహితులను తన రూమ్‌కి రప్పించాడు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
ఆపై సోమవారం ఉదయం ఆ బాలికను ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.