/rtv/media/media_files/2025/03/21/mySZOpoyVcJpEV97KmU2.jpg)
CM Siddaramaiah responds on Honeytrap in Assembly
కర్ణాటకలో ప్రస్తుతం హనీట్రాప్ అంశం దుమారం రేపుతోంది. మంత్రులు సహా అనేక మంది ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. అయితే శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ డిమాంట్ చేసారు. హానీ ట్రాప్ విచారణను పక్కనపెట్టి స్పీకర్ ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడంతో విమర్శలు చేశారు. ఆయన చుట్టూ చేరి నిరసనలు తెలిపారు.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
CM Siddaramaiah Says About Honey Trap
దీంతో బీజేపీ నేతల తీరుపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. కేసు నమోదై దర్యాప్తు మొదలైతే హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. చట్టప్రకారమే దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ నేతలు సభలు అనవసరంగా గందరగోళం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.
Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!
ఇదిలాఉండగా కర్ణాటకకు చెందిన చాలామంది రాజకీయ నేతలు హనీట్రాప్‌లో చిక్కుకుపోయారని సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో చెప్పడం సంచలనం రేపింది. దాదాపు 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని చెప్పారు. వాళ్లకి సంబంధించిన అసభ్య వీడియోలు సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో ఉన్నాయన్నారు. ఇది ఒక్క పార్టీకే పరిమితమైన అంశం కాదని.. అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలకు చెందినవాళ్లు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారని తెలిపారు .
Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?
Also Read: హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పేందుకు వెళ్తే ఊహించని ట్విస్ట్
karnataka | rtv-news | honey trap telugu news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu