/rtv/media/media_files/2025/03/13/zn2co1VzK3zN5y9XLOL3.jpg)
chennai car acd Photograph: (chennai car acd)
Accident: చెన్నైలో జరిగిన కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బంధువు అని పోలీసులు గుర్తించారు. చెన్నైలోని అల్వార్ తిరునగర్‌లో ఐటీ కంపెనీలో పనిచేస్తున్న అరవింద్ రవిచంద్రన్.. మార్చి 9న ఆడి కారులో చెన్నై నుంచి విల్లుపురం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే విల్లుపురం జిల్లా దిండివనం నుంచి మెల్మలయనూర్ వైపు వెళ్తున్న నారాయణసామి (39), మీనా (31) ద్విచక్ర వాహనాన్ని ఒంగూర్ వంతెన దగ్గర ఢి కొట్టాడు. నారాయణసామి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అతని భార్య మీనాను అచ్చిరపాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
సీసీటీవీని తనిఖీ చేయగా..
అయితే ప్రమాదానికి కారణమైన అరవింద్ కారు ఆపకుండా విల్లుపురం వెళ్లకుండానే చెన్నైకి తిరిగి వచ్చాడు. ఈ ప్రమాదంపై మృతుడు నారాయణసామి సోదరుడు కృష్ణన్ (44) ఓలక్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట ఏ వాహనం ప్రమాదానికి కారణమైందో పోలీసులకు తెలియలేదు. ఒంగూరు టోల్ గేట్ సీసీటీవీని తనిఖీ చేయగా అరవింద్ కారు విల్లుపురం వైపు వెళ్లి వెంటనే చెన్నైకి తిరిగి వచ్చిందని తేలింది. తరువాత పోలీసులు అరవింద్‌ను ఫోన్‌లో సంప్రదించి ప్రమాదం గురించి ఆరాతీశారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
అతనే కారుతో ఢి కొట్టినట్లు తేలడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంధువు అని తేలింది. నిర్మలా సీతారామన్.. అరవింద్ అత్త కూతురు అని పోలీసులు గుర్తించారు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..