![Nirmala Seetharaman](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/17/3mmQcB02dNkaFIfUQxJE.jpg)
Nirmala Seetharaman
నారు పోశావా.. నీరు పెట్టావా? కోత కోశావా? కుప్పనూర్చవా? ఒరేయ్ తెల్ల కుక్క.. నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా.. అని సీనియార్ ఎన్టీఆర్ 20ఏళ్ల క్రితం చెప్పిన డైలాంగ్ ఇప్పటికీ ఫేమస్. స్వతంత్ర పోరాట యోధుడు వీరపాండ్య కట్ట బ్రహ్మణ బ్రిటిష్ వారి పన్ను విధానానికి ఎదురుతిరిగి ప్రశ్నించిన తీరుని మేజర్ చంద్రకాంత్ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే రాజ్యాలు పోయినా.. రాజులు మారినా? దేశంలో పేద ప్రజల్ని పిండి పిప్పి చేసే పన్ను విధానాలు మాత్రం మారడం లేదు. పేదవాడిపైనే పన్ను భారం అన్నట్లు ప్రస్తుతం ట్యాక్స్ స్కేల్ ఉంది. సంపన్నులు ఎక్కువ ట్యాక్స్ కడితే.. వారికి పన్నులో రాయితీ ఉంటుంది. కానీ.. ఓ సామాన్యుడిపై సర్వీస్ ట్యాక్స్ అని, జీఎస్టీ అని, ఎస్‌జీటీ అని, సీజీఎస్టీ అని, కన్స్యూమర్ ట్యాక్స్ అని పదుల సంఖ్యలో పన్నులు విధిస్తోంది ప్రభుత్వం.
Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
గత ఆర్థికసంవత్సరం ఇప్లిమెంట్ చేసిన ట్యాక్స్ శ్లాబ్‌పై ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman), కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చిన్నా చితక ఉద్యోగాలు చేసుకునే వారిపై 2024-25 ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ విధానం పెద్ద దెబ్బే కొట్టింది. ఆ విషయం సెంట్రల్ గరవర్నమెంట్‌కు అర్థమైంది. ఎన్డీయే కూటమి పన్నుల పెంపుపై 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపింది. ఇండియా జీడీపీ వృద్ధి రేటు కూడా తగ్గింది. దీంతో ఈ ఏడాది ఆచితూచి ట్యాక్స్ శ్లాబ్‌ను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పెంచాలని ఆర్థికవేత్తలు, కన్సల్టింగ్ సంస్థలు సైతం అభిప్రాయపడుతున్నాయి. అనుకున్నట్లే బడ్జెట్‌లో భారీ గుడ్‌న్యూస్‌లు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు నుంచి సమాచారం. నెక్ట్స్ ఫైనాన్షియల్ ఈయర్ బడ్జెట్‌లో మోదీ చేయబోయే మ్యాజిక్ ఏంటి? కష్టజీవులని నిర్మలమ్మ ఎలా కణికరిస్తుంది ? ఇప్పుడు చూద్దాం రండీ..!
Read also : రేపే గ్రూప్ 2 'కీ' విడుదల.. టీజీపీఎస్సీ కీలక సూచనలు
ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఫొటోకి మథర్ తెరిస్సా గెటప్ వేసి.. మథర్ ట్యాక్సిస్ పేరు పెట్టి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా పాప్‌కాన్‌పై మూడు రకాల ట్యా్క్స్ వేస్తున్నారని కూడా నిర్మలా సీతారామన్‌ను ట్రోల్ చేశారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వేతన జీవులు ఆమెపై చాలా ఫైర్ అవుతున్నారు. వాళ్ల కోపాన్ని తగ్గించడానికి మోదీ ఓ మంత్రం చదవనున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, PMO అధికారులు గత రెండు నెలలుగా బడ్జెట్ (Budget 2025-26) ప్యానెల్‌తో చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించనుంది. ఆరోజు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్‌న్యూస్ చెబుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 2025 బడ్జెట్‌లో ఈ మ్యాజిక్స్ జరుగుతాయని ఆర్థికవేత్తలు, మేధావులు చర్చించుకుంటున్నారు.
Read also : Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వాళ్లకి బిగ్ రిలీఫ్
Budget 2025-26 - Nirmala Seetharaman
- ఎంప్లాయిస్‌ను కూల్ చేయడానికి స్టాండర్డ్ డిడక్షన్ కేంద్రం పెంచనున్నట్లు తెలుస్తోంది. గతేడాది రూ.50 వేలు ఉన్న స్టాండర్ట్ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచింది. ఉద్యోగుల మీద భారాన్ని తగ్గించాలంటే దీన్ని ఇంకా తగ్గించాలనేది సెంట్రల్ ముందున్న ఆప్షన్. వినియోగాన్ని పెంచి.. జీడీపీ వృద్ధిని ఊతమిచ్చేందుకు కేంద్రం ముందు ఆ నిర్ణయాలు ఉన్నాయి.
- ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబ్‌లను సవరించడం రెండో ఆప్షన్. యానువల్ ఇన్‌కం రూ.12-15 లక్షలు ఉద్యోగులకు 20 శాతం ట్యాక్స్ పడుతుంది. అయితే దీన్ని రూ.12 - రూ.15 లేదా రూ.20 లక్షలు చేసే ఆలోచనలో కేంద్రం ఉందట.
- రూ.15 లక్షల పైబడి ఆదాయం ఉన్నవారు 30 శాతం ట్యాక్స్ కట్టాలి. కానీ దాన్ని రూ.18-20 లక్షల యానువల్ ఇన్‌కం ఉన్నవారికి వర్తింపజేయాలనే సిఫార్సు కూడా కేంద్రం ముందు ఉంది.
- 60ఏళ్లు దాటిన వృద్ధులకు సపరేట్‌గా ట్యాక్స్ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. సీనియర్ సిటీజన్లకు రూ.3 లక్షల పన్ను మినహాయింపు ఉంది.
- ప్రస్తుతం భారత్‌లో బంగారంపై 6 శాతం దిగుమతి పన్ను విధిస్తున్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి పన్నును 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు 2024 జూలై 24న అమల్లోకి వచ్చింది. బంగారం దిగుమతులను అరికట్టడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి రాబోయే బడ్జెట్‌లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
- హౌస్ లోన్లకు, ఈఎంఐలకు ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రయోజనం చేకురేలా ఆలోచిస్తున్నారు.
- 2003లో సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.లక్ష వరకు మినహాయింపు లభించింది. 2014లో ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం కలిగించినా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుదల సరిపోలేదు. జీవన వ్యయం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 80సీ పరిమితిని మరింత పెంచాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూ.3.5 లక్షలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్ర నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
2023-24 ఫెనాన్షియల్ ఈయర్‌లో 8.2 శాతం ఉన్న జీడీపీ వృద్ధి రేటు.. 2024-25లో 6.4 శాతానికే ఉండొచ్చని కేంద్ర గణాంకాలు అంచావా చెబుతుంది. వినియోగ స్థాయి తగ్గడమే దీనికి కారణమట. అందుకే వచ్చే బడ్జెట్‌లో డెవలప్‌మెంట్ ప్రోత్సహించే చర్యలు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.