/rtv/media/media_files/2025/03/19/45TTx2jIL9O50ivxHpT7.jpg)
UPI Payment (file Photo)
UPI Transactions: బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లో(India) ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు 210 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో భాగంగానే బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలకు ప్రోత్సహకాలు అందిస్తున్నామని ప్రకటించింది. ప్రతి రెండు వేల రూపాయల లోపు లావాదేవీలకు సంబంధించి 0.15 శాతం ప్రోత్సహకాలు అందించనుంది. ఇందులో భాగంగా ఈ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ నిర్ణయించింది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
అయితే కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. '' యూపీఐ లావాదేవీలు రూ.210 లక్షల కోట్లకు చేరాయి. రూ.2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ప్రసుతం యూపీఐ విధానంలో చూసుకుంటే కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ నుంచి 4 అంచెల్లో లావాదేవీలు పెరుగుతున్నాయి. రూ.1500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు ఛార్జీలు విధించడం లేదని'' తెలిపారు.
Also Read: సునీతా విలియమ్స్ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ?
కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు
మరోవైపు వీటితో పాటు కేంద్రం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. అసోంలో బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.10,601 కోట్లతో అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు, అలాగే రూ.2790 కోట్లతో పాడిపరిశ్రమ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. అంతేకాదు గోకుల్ మిషన్‌కు రూ.3400 కోట్లు, రూ.4500 కోట్లతో మహారాష్ట్రలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు పచ్చజెండా ఊపింది.
Also Read: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
Also Read: ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్‌కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!