Ranya Rao: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి రన్యారావుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఇందులో భాగమైన మంత్రుల చిట్టా తన దగ్గర ఉందన్నాడు. 

New Update
ranya rao case

BJP MLA Basana Gowda vulgar comments on Ranya Rao

గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) పై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఈ బ్లాక్ దందాలో పత్ర్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో బయటపెడతానంటూ సంచలనం సృష్టించాడు. అంతేకాదు రన్యారావు సంబంధించిన సమాచారం మొత్తం తన దగ్గర ఉందని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Also Read :   Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్?

రన్యరావు తండ్రికి షాక్..

మరోవైపు రన్యారావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావుకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) షాక్ ఇచ్చింది. ఆయనను తప్పనిసరి లీవ్‌పై పంపించింది. దీనికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే రన్యారావు పట్టుబడడంపై సవతి తండ్రి రామచంద్రరావు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా తన నోటీసుకు వచ్చిందని, ఆమె ఇలాంటి పనులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇంతకంటే మాట్లాడటానికి ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ఇప్పుడు తమ ఇంట్లో లేదని, భర్తతో కలిసి ఉంటోందని చెప్పారు. 

Also Read :  USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

ఇక పోలీసులు బెంగళూరు సహా అనేక చోట్ల దాడులు చేపట్టారు. రాజధానిలోనే ఎనిమిదిచోట్ల సోదాలు చేసినట్లు సమాచారం. ఈ రాకెట్‌లో భారీ కుట్రదాగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఈడీ.. ఆ దిశగానే దర్యాప్తు చేస్తోంది. రన్యా పెళ్లికి సీఎం సిద్ధరామయ్య కూడా హాజరైన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. ఆయన వేల వివాహాలకు హాజరయ్యారంటూ కర్ణాటక హోంమంత్రి ఆగ్రహంగా సమాధానమిచ్చారు. 

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read :  స్వాతి హత్య కేసు మరో కీలక మలుపు.. లవ్‌ జిహాద్ అని ఆరోపిస్తున్న హిందూ సంఘాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు