Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

బిహార్‌ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

New Update
Maha Kumbh Mela 2025 trains

Maha Kumbh Mela 2025 trains Photograph: (Maha Kumbh Mela 2025 trains)

Maha Kumbh Mela: యూపీ(UP)లోని ప్రయాగ్‌ రాజ్‌(Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు దేశ వ్యాప్తంగా  ఉన్న ప్రజలతో పాటు విదేశాల నుంచి సైతం అనేక మంది భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అందరిలాగే కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. అన్నీ సర్దుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లగా.. రైలు ఎక్కలేకపోయాడు. అందుకు కారణం రైలు తలుపులు లోపలి నుంచి మూసి ఉండడమే. దీంతో వెనక్కి వచ్చి కుంభమేళాకు వెళ్లలేకపోయిన ప్రయాణికుడు భారతీయ రైల్వే శాఖ(Indian Railways) పై ఫిర్యాదు చేశాడు. 

Also Read: TG News: గుణపాఠం నేర్వని కేసీఆర్‌.. అభ్యర్థులులేక ఆగమైతండు: టీపీసీసీ మహేశ్‌!

తన టికెట్ డబ్బులతో పాటు వాటికి వడ్డీ కట్టాలని, అలా జరగని పక్షంలో 50 లక్షల రూపాయల నష్ట పరిహారం తన కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన జనక్ కిషోర్ ఝా కూడా మహా కుంభమేళాకు వెళ్లాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను కూడా తన వెంట యూపీకి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. ఈక్రమంలోనే ఏసీ 3 కోచ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. 

Also Read: Crime News: సికింద్రాబాద్‌లో తల్లి శవంతో 8రోజులు.. ఇంట్లో గడిపిన ఇద్దరు కూతుళ్లు

జనవరి 26వ తేదీన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. కాసేపటికి రైలు కూడా వచ్చి ఆగింది. ఈక్రమంలోనే లగేజీ తీసుకుని రైలు ఎక్కబోయాడు. కానీ తలుపులు ఎంతకూ తెరుచుకోలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక రైల్వే అధికారులను సంప్రదించాడు. కానీ వారు కూడా పెద్దగా స్పందించలేదు. 

ఇలా జనక్ కిషోర్ ఝా, ఆయన కుటుంబ సభ్యులు రైలును ఎక్కలేకపోయారు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాడు. కానీ 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు చాలా బాధ పడ్డారు.  ఆర్థికంగా కూడా నష్టపోవడంతో.. తమను కుంభమేళా వెళ్లకుండా చేసిన రైల్వే శాఖపై ఫిర్యాదు చేయాలనుకున్నాడు.

డబ్బుల మొత్తాన్ని వడ్డీతో సహా..

ఈక్రమంలోనే 15 రోజుల్లోగా తన టిక్కెట్ డబ్బుల మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాల్సిందిగా భారతీయ రైల్వే బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను జనక్ కిషోర్ ఝా అధికారికంగా కోరారు. అదనంగా అతను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. నిర్ణీత గడువులో డబ్బులు రీఫండ్ చేయకపోతే రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశాడు.

Also Read: VD 12 Movie: విజయ్ దేవరకొండ ‘VD 12’ చిత్రానికి మాస్ టైటిల్.. అదిరిపోయిందంతే!

Also Read: AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment