BIG BREAKING: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. సోషల్‌ మీడియాలో రూల్స్‌

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్‌ విధించింది. దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

New Update
Bihar Enforces Social Media Norms For Govt Employees, Disciplinary Action For Violations

Bihar Enforces Social Media Norms For Govt Employees, Disciplinary Action For Violations

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్‌ విధించింది. దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డిజిటల్ సంస్థాగత క్రమశిక్షణను కాపాడుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫేస్‌బుక్, ఎక్స్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా వ్యవహరించేలా చేయడమే తమ టార్గెట్ అని స్పష్టం చేసింది. ఇంతకీ నితిష్ సర్కార్ ఎలాంటి రూల్స్ విధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.  

సోషల్ మీడియాపై రూల్స్ ఇవే 

1.ప్రభుత్వ స్కీమ్స్‌, విధానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు. 

2.వ్యక్తిగత సోషల్‌ మీడియా అకౌంట్లకు సంబంధించి సంస్థ అధికారిక మొబైల్‌ నంబర్లను, ఈమెయిల్‌ ఐడీలను వాడకూడదు.

3.ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం నిషేధం

4.ఆఫీస్‌ ప్రాంగణంలో ఉన్న సమయంలో సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు షేర్‌ చేసేందుకు పర్మిషన్ ఉండదు.

5.రీల్స్‌, లైమ్‌ స్ట్రీమ్‌ లాంటివి చేయడం పూర్తిగా నిషేధం. 

6. విక్ష పార్టీలకు, మీడియా సంస్థలకు, సోషల్‌ మీడియాలో ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ ఇవ్వకూడదు.

 7.కుల, మత విభేదాలను రెచ్చగొట్టేలా, సున్నితమైన అంశాలపై పోస్టులు చేయకూడదు.

Also Read: పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని బిహార్ ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న జూనియర్ నుంచి సీనియర్‌ ఉద్యోగుల దాకా ఈ కండిషన్లు వర్తిస్తాయని ఆదేశాలు జేరీ చేసింది. అంతేకాదు కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించి కూడా సవరణ చేసింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులు ఇతర పోటీ పరీక్షలు రాయాలంటే అయిసార్లు ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఒక్కసారికి మాత్రమే పరిమితం చేసింది. దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ కూడా తప్పనిసరి చేసింది.  

Advertisment
తాజా కథనాలు