/rtv/media/media_files/2025/03/25/BXg2iNUAdTik9SBawpgb.jpg)
banks
ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ 1, 2025 నుంచి కూడా అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులుగా చెప్పుకోవచ్చు. అయితే ఇవి నేరుగా మీ జేబులపై ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ మారే రూల్స్ ప్రభావం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు ఏటీఎం డబ్బు విత్ డ్రా రూల్స్ విషయంలో కీలక మార్పులను తీసుకొస్తోంది.
Also Read: VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు
దీనికి తోడు సేవింగ్స్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ విషయంలో కూడా మార్పులు రాబోతున్నాయి. దీనికి తోడు నేరాలను అరికట్టడానికి బ్యాంకింగ్ సేలను మెరుగుపరుస్తూ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ప్రస్తుతం ఏప్రిల్ మెుదటి తేదీ నుంచి కీలక మార్పులు రాబోతున్నాయి. ముందుగా ఏటీఎం లావాదేవీల విషయంలో కీలక మార్పులు రాబోతున్నాయి.
వినియోగదారులకు అందించే మెుత్తం ఉచిత లావాదేవీలు, వాటి గరిష్ఠ పరిమితులు, లిమిట్ దాటి చేసే లావాదేవీలపై వసూలు చేయబోచే ఛార్జీల గురించి మార్పులు రానున్నాయి. ఈ క్రమంలో నెలకు అందించే ఉచిత లావాదేవీల సంఖ్య మరింతగా తగ్గాయని తెలుస్తోంది. లిమిట్ తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 20 నుండి రూ. 25 వరకు ఛార్జ్ ఉంటుంది.
ఇక తీసుకొస్తున్న మరో కీలక మార్పు అకౌంట్లో నిర్వహించాల్సిన మినిమం బ్యాలెన్స్ గురించే. ఈ క్రమంలో పరిమితులను పెంచటంతో పాటు ఖాతాలో మినిమం క్యాష్ నిర్వహించనుందుకు విధించే ఛార్జీల పెంపు కూడా ఉండనుంది. అనేక బ్యాంకులు దీనికి అనుగుణంగా తమ రూల్స్ సవరించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ శాఖ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఇవి మారనున్నట్లు తెలుస్తోంది.
బ్యాంకింగ్ మోసాలను తగ్గించటానికి రిజర్వు బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్ అమలు చేసింది. లావాదేవీ భద్రతను మెరుగుపరచడానికి అనేక బ్యాంకులు PPS ను అమలు చేస్తున్నాయి. 50 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసే కస్టమర్లు, PPS వారు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురించి ముఖ్యమైన వివరాలను ఎలక్ట్రానిక్‌గా బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. చెల్లింపు కోసం చెక్కును సమర్పించే ముందు, ఈ డేటా ధృవీకరించబడుతుంది.
అలాగే కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ చాట్ బాట్స్ ఖాతాదారులకు అనేక వివరాలను తక్కువ సమయంలో అందించేలా మార్పులను ప్రవేశపెడుతున్నాయి బ్యాంకులు. అలాగే సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను పెంపొందించటానికి 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి మెరుగైన భద్రతా చర్యలు బలోపేతం చేయబడతాయి.
అలాగే దేశంలోని వివిధ బ్యాంకులు తమ వడ్డీ రేట్ల మార్పులకు శ్రీకారం చుట్టాలని చూస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ రెపో రేటుకు అనుగుణంగా డిపాజిట్లతో పాటు కొత్తగా అందించే రుణాలపై రేట్ల మార్పులను ప్రకటించాలని అవి చూస్తున్నాయి.
ఇక చివరిగా కొత్త నెల ప్రారంభం నుంచి మార్కెట్లోని అనేక బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలోనూ కీలక మార్పులను సూచిస్తున్నాయి. రివార్డు పాయింట్లు, ఛార్జీల విషయంలో ఈ మార్పులు రాబోతున్నాయి. SBI SimplyCLICK Swiggy రివార్డులను 5Xకి సగానికి తగ్గించి, ఎయిర్ ఇండియా సిగ్నేచర్ పాయింట్లను 30 నుండి 10కి తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది. IDFC ఫస్ట్ క్లబ్ విస్తారా మైలురాయి ప్రయోజనాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
అన్నింటి కంటే ముఖ్యంగా యూపీఐ వినియోగదారులు ఎక్కువ కాలం నుంచి ఉపయోగించని ఐడీలను కొత్త నెల నుంచి డీయాక్టివేట్ కానున్నాయి. సదరు మెుబైల్ నంబర్లను బ్యాంక్ రికార్డుల నుంచి కూడా తొలగించబడతాయని తెలుస్తోంది. దీంతో ఉపయోగం లేని యూపీఐ ఐడీ కలిగిన ఖాతాలు పనిచేయటం ఆగిపోనున్నాయి.
banks | new-rules | upi | payments | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates