Arvind Kejriwal: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానంటూ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన గురువారం విడుదల చేశారు.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
'' రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రాధాన్యత. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడం కోసం మా టీమ్ ఓ ప్లాన్‌ను రూపొందిస్తోంది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) కేవలం రెండేళ్లలోనే 48 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. అలాగే మూడు లక్షలకు పైగా ప్రైవేటు రంగ ఉద్యోగాలు కల్పించింది. యువతకు ఉద్యోగాలు ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ప్రజల మద్దతులో ఢిల్లీలో మళ్లీ గెలిస్తే.. రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని'' అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
अगले 5 साल में हमारी सबसे बड़ी प्राथमिकता हमारे युवाओं के लिए रोज़गार और नौकरियाँ पैदा करना होगी। https://t.co/ZM6Hwc62rw
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 23, 2025
ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు..
ఇదిలాఉండగా ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ఈసారి ఢిల్లీ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: ఫ్లాట్ ఇప్పిస్తానని మంత్రి చెల్లెల్ని మోసం.. మాజీ ఎమ్మెల్యే దంపతులు అరెస్ట్!
Also Read: మహాకుంభమేళాకు ముస్లిం వ్యక్తి... రుద్రాక్ష ధరించి త్రివేణి సంగమంలో స్నానం