అప్పటిదాకా చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన నిర్ణయం

చెన్నైలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనన్నారు.అలాగే ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుంటానని ప్రతీజ్ఞ చేశారు.

New Update
annamalai

annamalai

తమిళనాడులోని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరగడం దుమారం రేపుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ అధికారం కోల్పోయేవరకు తాను పాదరక్షలు వేసుకోనని ప్రతీజ్ఞ చేశారు. గురువారం కోయంబత్తూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'' DMK ప్రభుత్వాన్ని అధికారం కోల్పోయేవరకు నేను పాదరక్షలు వేసుకోను. అవి లేకుండానే నడుస్తాను. ఎన్నికల్లో గెలవడానికి డబ్బులను ఎరగా చూపించం. రూపాయి పంచకుండా ఎన్నికల బరిలోకి దిగుతాం. వచ్చే ఎన్నికల్లో గెలిచేవరకు చెప్పు ధరించనని'' అన్నామలై ప్రతీజ్ఞ చేశారు. అలాగే తమిళనాడులో చెడు అంతం కావాలని కోరుకుంటూ తన ఇంట్లో ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. అలాగా రాష్ట్రంలో ఉన్న ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేడతానని చెప్పారు. 

Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

అయితే అన్నా వర్సిటీకి చెందిన బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ను లీక్ చేయడంపై కూడా అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగిలే పోలీసులు వ్యవహరించారంటూ ధ్వజమెత్తారు. లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడు జ్ఞానశేఖరన్‌పై రౌడీషీట్‌ తెరవలేదని ఆరోపించారు. డీఎంకే పార్టీతో అతనికి సంబంధం ఉండటమే కారణమని విమర్శించారు. ప్లాన్ ప్రకారం కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఇదిలాఉండగా పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 23న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపరిచి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి .. తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. 

Also Read: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి

అయినప్పటికీ బాధితురాలు ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు  యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్‌ గా గుర్తించారు. జ్ఞానశేఖరన్‌ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment