/rtv/media/media_files/2024/12/31/PpJMfI6GynWynZFFk1Oe.jpg)
Amit Shah'sensational statements on maoist encounter
Maoist: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు.
‘नक्सलमुक्त भारत अभियान’ की दिशा में आज हमारे जवानों ने एक और बड़ी सफलता हासिल की है। छत्तीसगढ़ के बीजापुर और कांकेर में हमारे सुरक्षा बलों के 2 अलग-अलग ऑपरेशन्स में 22 नक्सली मारे गए।
— Amit Shah (@AmitShah) March 20, 2025
मोदी सरकार नक्सलियों के विरुद्ध रुथलेस अप्रोच से आगे बढ़ रही है और समर्पण से लेकर समावेशन की…
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది నక్సలైట్లు మరణించడంపై అమిత్ షా మాట్లాడుతూ.. ఈరోజు మన సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. మోడీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. లొంగిపోని నక్సలైట్లపై జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుందన్నారు.
Also Read: త్వరలో టోల్ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ
ఇక గురవారం ఉదయం బీజాపుర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ -దంతెవాడ జిల్లాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బలగాలు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఘటనాస్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read: సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి
(amith-sha | chattisaghad | telugu-news | rtv telugu news | today telugu news | latest-telugu-news)