వరల్డ్ వైడ్ ఏఐ టెక్నాలజీ (AI Technology) రంగంలో పెట్టుబడులు ఊపదుకున్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్‌వేర్ రంగాన్ని భవిష్యత్ లో ఏఐ శాసించనుంది. ప్రస్తుత జీడీపీలో 7.5 శాతం టెక్ రంగం నుంచే వస్తోంది. అది 2025 చివరి నాటికి 10 శాతానికి చేరుకుంటుందని టెక్ రంగంలో నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే AI రంగంలో భారత్ (India) పెట్టుబడులు, బడ్జెట్ కేటాయింపులు కీలకంగా మారనున్నాయి. ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అవ్వడానికి అవసరమైన ప్రయత్నాలను స్పీడ్ అప్ చేసింది. ఈక్రమంలోనే 2025 బడ్జెట్ కేటాయింపులో రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
Also Read : Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌లో హైలెట్స్ ఇవే!
Also Read : సహనం కోల్పోయిన పూజా హెగ్డే.. ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఏం చేసిందంటే?
World Wide AI Technology - Budget 2025
2025 చివరికల్లా ఇండియాకు సొంతంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్ వస్తోందని తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (Aswini Vaishnav) ప్రకటించారు. ఇది మెషిన్ లెర్నింగ్ ప్రొగ్రామ్. చాట్ జీపీటీ, డీప్‌సీక్ మోడల్స్ లా ఇది కూడా పని చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలో ఏఐ మోడల్ 10వేల జీపీయూలను దాటింది. 18,600 జీపీయూలను లక్ష్యంగా భారత్ పని చేస్తోంది. ఆరుగురు ప్రధాన డెవలపర్లు కలిసి భారత్‌కు చెందిన ఏఐ మోడల్ పై పనిచేస్తున్నారు. ఇండియా ఫస్ట్ సొంత ఏఐ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసరికి 4-10 నెలలు పట్టొచ్చు. తాజాగా ట్రెండింగ్‌లోకి వచ్చిన చైనా డీపీసీక్ 2,000 జీపీయూలు, అమెరికా చాటీపీటీ 4 వెర్షన్ 25,000 జీపీయూలతో అభివృద్ధి చేశారు.
Also Read : వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?
Also Read : క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ ప్లేయర్.. కంగారుపడుతున్న ఫ్యాన్స్