AAP: కేజ్రీవాల్కు ఘోర అవమానం.. ఆప్ కార్యాలయానికి తాళం!

ఆమ్ ఆద్మీ పార్టీకి  కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు.  

New Update
aap bhopal

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) కి  కష్టాలు తగ్గడం లేదు. తాజాగా ఆ పార్టీకి ఊహించని పరభావం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది.  ఆ పార్టీ కార్యాలయానికి గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు.  

Also Read :  ఎండిన పొలాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి

రూ. 60 వేల అద్దె.. రూ.13 వేల విద్యుత్ బిల్లు

దిలీప్ మీడియాతో  మాట్లాడుతూ, గత మూడు నెలలుగా ఆప్ (AAP)  ఇంటి రెంటు చెల్లించలేదని, కరెంట్ బిల్లు కూడా పెండింగ్‌లో పెట్టిందని అన్నారు.  రెంటు చెల్లింపుపై పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాళం వేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనకు రెంట్ క్లియర్ చేస్తే  వెంటనే గేటు తాళం తెరుస్తానని వెల్లడించాడు.  ఇంటి యజమాని ప్రకారం 3 నెలలకు గానూ రూ. 60 వేల అద్దె.. రూ.13 వేల విద్యుత్ బిల్లును పార్టీ చెల్లించాల్సి ఉంది.  దీనిపై ఆప్ రాష్ట్ర అధ్యక్షురాలు రీనా అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితి గురించి తనకు తెలియదని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలుచుకుంది. రాణి అగర్వాల్ 2022లో సింగ్రౌలి మేయర్ అయ్యారు.

Also Read :  ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. స్ట్రీమింగ్ ఇందులోనే!

2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత  ఆమ్ ఆద్మీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని అనుకుంది. అందులో భాగంగా 2018లో ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేసింది.ఆ  ఎన్నికల్లో ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్ గల్లంతైంది. 2023లో కూడా ఆ పార్టీ కొన్ని  స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో ఖాతా తెరవలేకపోయింది.ఇక 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ అధికారాన్ని కోల్పోయింది. 27 ఏళ్ల తరువాత బీజేపీ జెండా పాతింది. 

Also Read :   ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియానే.. ఆస్ట్రేలియా ఓడిపోతుంది : మైఖేల్ క్లార్క్

Also Read :  అంతా తూచ్.. పోసాని అనారోగ్యంతో బాధపడడం ఒక డ్రామా : సీఐ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment