Viral News: ఖైదీని లవ్ చేసి పెళ్లాడిన జైలర్.. ఇది మామూలు లవ్ కాదు మావా..!

మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రేమ వివాహం జరిగింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ అనే మహిళ, అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకుంది.

New Update
A Murder Convict, A Jailer Fell In Love In Satna Jail. VHP, Bajrang Dal Got Them Married

A Murder Convict, A Jailer Fell In Love In Satna Jail. VHP, Bajrang Dal Got Them Married

మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రేమ వివాహం జరిగింది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్ అనే మహిళ, అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2007లో ఓ కౌన్సిలర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మేంద్ర సింగ్‌కు జీవిత ఖైదు పడింది. ఇతడు జైల్లో ఉండగా వారెంట్‌ ఇన్‌ఛార్జిగా ఉనన్ ఫిరోజాకు పని విషయాల్లో సాయపడుతూ ఉండేవాడు. వీళ్లద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. 

Also Read: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. మండిపడుతున్న నెటిజన్లు.. VIDEO

Jailer Fell In Love In Satna Jail

ధర్మేంద్ర సింగ్ 14 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్న తర్వాత 2021లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగింది. చివరికి ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మే 5న ఛత్‌ర్‌పూర్ జిల్లాలో వీళ్ల పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. జైలు అధికారిణి, మాజీ ఖైది మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  

Also Read: షాకింగ్ ఘటన.. ఈడీ సోదాల భయంతో రోడ్డుపై విసిరేసిన రూ.500 నోట్ల కట్టలు

ఇద్దరు భిన్న మతాలకు చెందిన వారు కావడంతో ఫిరోజా ఖాతున్ కుటుంబ సభ్యులు ఈ మతాంతర పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఆమె ధర్మేంద్ర సింగ్‌ను చేసుకుంటానని తేల్చిచెప్పారు. దీంతో విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా ఉపాధ్యక్షుడు, ఆయన భార్య ముందుకొచ్చారు. హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మేంద్ర సింగ్, ఫిరోజాకు ఘనంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు బజరంగ్ దళ్‌ సభ్యులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మతపరమైన అడ్డంకులు, కుటుంబ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఓ మాజీ ఖైదీ, జైలు అధికారిణి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Advertisment
తాజా కథనాలు