/rtv/media/media_files/2026/04/18/jamili-elections-2026-04-18-11-31-54.jpg)
2029 Polls with Existing Seats, Jamili Elections Unlikely, Say Experts
మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు(women-reservation-bill) వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సీట్ల ప్రకారమే సాధారణ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు(Jamili Elections 2029) కూడా నిర్వహించడం కష్టమేనని అంటున్నాయి. ఒకవేళ పునర్విభజన, మహిళా బిల్లులను కేంద్రం మళ్లీ ఆమోదించుకోవాలనుకుంటే విపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నాయి.
మహిళా రిజర్వేషన్ అమలను డీలిమిటేషన్(delimitation) కు లింక్ పెట్టడం వల్ల లోక్‌సభలో విపక్షాలు వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా డీలిమిటేషన్ బిల్లు పెట్టి ఆమోదించుకోవడం సాధ్యం కాదని అర్థమైపోయింది. మొత్తానికి 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయానికి డీలిమిటేషన్ లేనట్లేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అయితే 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీని ప్రకారం 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలి. ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి.
Also Read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పదవీకాలం 2029తో ముగియనుంది. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోగా ఇంకా మూడేళ్లు మిగిలిఉన్నాయి. జనగణన పూర్తి చేసి గణాంకాలు ప్రకటించేందుకు రెండేళ్లు సమయం పడుతుందని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ తర్వాత డీలిమిటేషన్ కోసం కమిషన్ వేసి, ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఏడాదిలో సాధ్యం కాదని చెబుతున్నాయి.
మరోవైపు జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లోకస్‌భ సీట్లను 543 నుంచి 850కు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో 815 సీట్లు రాష్ట్రాలకు, మరో 35 కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే అవకాశం ఉంది. దీని ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలకు 620, దక్షిణాది రాష్ట్రాలకు 195 సీట్లు మాత్రమే వస్తాయని ప్రచారం నడుస్తోంది. ఇలా జరిగితే దక్షిణ రాష్ట్రాలకు లోక్‌సభలో బలం లేకుండా పోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read: ఐటీలో ఉద్యోగులకు బిగ్ షాక్.. 3 నెలల్లోనే 80 వేల మందికి లేఆఫ్స్
విపక్షాల సపోర్ట్ కావాల్సిందే
ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ చేసి, జమిలి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుల్లో మళ్లీ మార్పులు చేసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంటుంది. ఈ బిల్లులను ఎన్డీయే తన సొంత బలంతో ఆమోదించుకోవడం కష్టమని తేలిపోయింది. కచ్చితంగా విపక్షాల సపోర్ట్ కావాల్సిందే. ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందే విపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అయితే 2026 జనాభా లెక్కలతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ కోసం అఖిలపక్ష పార్టీలు, స్టేక్ హోల్టర్లతో మీటింగ్‌లో నిర్వహించి ఏకాభిప్రాయనికి వస్తే ఈ బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జమిలి ఎన్నికలకు కూడా మార్గం సులభతరమవుతుందని అంటున్నారు.
Follow Us