/rtv/media/media_files/2025/02/20/x3zeb1RzXoXJyJ80rHZ4.jpg)
aryan shukla Photograph: (aryan shukla)
Aaryan Shukla: మహారాష్ట్రా (Maharashtra) కు చెందిన 14ఏళ్ల పిల్లవాడు రికార్డులు సృష్టించడంలోనే రికార్డ్ బ్రేక్ చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 6 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ (Guinness Book Of World Records) క్రియేట్ చేశాడు. అతని మైండ్ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ప్రయాణిస్తుందని చెప్పడంతో అతిశయోక్తి లేదు. మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్లా వయసు పద్నాలుగేండ్లు. అతనికి ఇంకో పేరు నిక్‌నేమ్ కూడా ఉంది అదే హ్యూమన్ క్యాలుక్యులేటర్. ఆర్యన్ టాలెంట్ చూసి ప్రపంచమే అబ్బురపడింది.
Also Read: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!
14 Year Old Aryan Shukla Created Six Guinness Book
🚀 INCREDIBLE ACHIEVEMENT! 🚀
— 𝘽𝙧𝙚𝙖𝙠𝙏𝙝𝙚𝙎𝙞𝙡𝙤𝙨♪♪ (@BholanathDutta) February 17, 2025
Meet Aaryan Shukla, the Indian teen math prodigy who’s taking the world by storm! 🌟 Known as the "Human Calculator Kid," Aaryan recently left audiences in awe on Italy’s *Lo Show Dei Record* by smashing SIX Guinness World Records in a single day!… pic.twitter.com/Bg9Weyln6Q
ఎందుకంటారా... 50 అంకెల సంఖ్యలను అత్యంత వేగంగా కూడి(కలిపి) టాస్క్ పూర్తిచేశాడు. అందుకుగాను గతేడాది ఆర్యన్ మొదటిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొల్లగొట్టాడు. దుబాయ్‌లో జరిగిన గిన్నిస్ రికార్డ్స్ పోటీలో శుక్లా 25.19 సెకండ్లలో ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో మొత్తం ఆరు గిన్నిస్ రికార్డులు ఆర్యన్ పేరు మీద నమోదయ్యాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే ఆర్యన్ సెకన్‌లో లెక్కేస్తాడు. అది మనవాడి టాలెంట్. లెక్కల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటోడు.
Also Read: Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్!
శుక్లా 100 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి 30.9 సెకండ్ల ట్రైం మాత్రమే తీసున్నాడు. 200 నాలుగంకెల సంఖ్యలను కలపడానికి1నిమిషం, 9.68 సెకండ్లు పట్టింది. 50 ఐదు అంకెల సంఖ్యలను కలపడానికి 18.71 సెకండ్లు, 20 అంకెల సంఖ్యను పదంకెల సంఖ్యతో భాగించడానికి 5 నిమిషాల 42 సెకండ్లు పట్టింది. రెండు ఐదంకెల సంఖ్యలను గుణించడానికి 51.69 సెకండ్లు, రెండు ఎనిమిది అంకెల సంఖ్యలను గుణించడానికి 2 నిమిషాల 35.41 సెకండ్ల టైం తీసుకున్నాడు. ఇలా గణితానికి సంబంధించిన ఆరు టాస్క్‌లను ఒకే రోజు పూర్తి చేశాడు. దీంతో ఆరు రికార్డులు సొంతం చేసుకున్నాడు ఆర్యన్. అత్యంత వేగంగా లెక్కించడం ఆర్యన్ ప్రత్యేకత కాబట్టి తనని ముద్దుగా హ్యూమన్ క్యాలుక్యులేటర్ అని పిలుస్తున్నారు. అయితే తన కొడుక్కి ఈ టాలెంట్ ఎలా వచ్చిందోనని శుక్లా తండ్రి కూడా ఆశ్చర్యపోతున్నాడు.
Also Read: ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం సంచలన నిర్ణయం!
ఆర్యన్ కేవలం 12ఏళ్ల వయస్సులోనే జర్మనీ 2022లో మెంటల్ కాలిక్యులేషన్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. అతను గతంలో అనేక అంతర్జాతీయ టైటిళ్లను కూడా గెలుచుకున్నాడు. మెంటల్ క్యాల్యుకేషన్ విభాగాలలో అనే రికార్డులను ఈ పిల్లాడు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఆర్యన్ ప్రపంచవ్యాప్తంగా మానసిక కాలిక్యులేటర్ల సంఘం అయిన గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక బోర్డు సభ్యులలో ఒకడు కూడా. ఆర్యన్ ఫాస్ట్‌గా లెక్కలు చేయడానికి రోజూ 6 గంటలు ప్రాక్టీస్ చేస్తాడట. ఇలా అతని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాడు ఆర్యన్.
Also Read: 'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన!